Refrigerator blast: ఫ్రిజ్‌ పేలి పోలీసు అధికారి, మహిళ మృతి

తమిళనాడులోని కోయంబత్తూర్‌లో ప్రిజ్‌ పేలిపోయింది. ఈ ఘటనలో ఒక పోలీసు అధికారితోపాటు మరో మహిళ ప్రాణాలు కోల్పోయారు. 

Published : 10 Mar 2023 00:14 IST

కోయంబత్తూర్‌: తమిళనాడులోని కోయంబత్తూర్‌ జిల్లాలో ప్రమాదం చోటు చేసుకుంది. ఫ్రిజ్‌ పేలిపోవడంతో ఓ పోలీసు అధికారితోపాటు మరో మహిళ ప్రాణాలు కోల్పోయారు. వివరాల్లోకి వెళ్తే.. చెన్నైలో పోలీస్‌ ఇన్‌స్పెక్టర్‌గా విధులు నిర్వర్తిస్తున్న శబరినాథ్‌తోపాటు మరో మహిళ పొల్లాచి సమీపంలోని నల్లూర్‌ గ్రామంలో నివసిస్తున్నారు. గురువారం అనుకోకుండా ఇంట్లోని ఫ్రిజ్‌ ఒక్కసారిగా పేలిపోయింది. అంతలోనే మంటలు అంటుకున్నాయి. దీంతో వాళ్లిద్దరూ మంటల్లో చిక్కుకొని ప్రాణాలు కోల్పోయారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు హుటాహుటిన సంఘటన స్థలానికి వెళ్లారు. మంటలను అదుపు చేసి, మృతదేహాలను వెలికి తీసి.. పోస్టుమార్టం నిమిత్తం దగ్గర్లోని ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు సీనియర్‌ పోలీసు అధికారి ఒకరు చెప్పారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు