Train accident: కోరమాండల్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలు ప్రమాదం.. ఏపీలో హెల్ప్‌లైన్‌ నంబర్లు

కోరమాండల్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలు ప్రమాద ఘటనకు సంబంధించి రైల్వే శాఖ ఏపీలో ప్రత్యేక హెల్ప్‌లైన్‌ నంబర్లు ఏర్పాటు చేసింది.

Updated : 03 Jun 2023 03:58 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఒడిశాలో జరిగిన కోరమాండల్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలు ప్రమాద ఘటనలో దాదాపు 200 మందికి పైగా మృతి చెందగా.. 900 మందికి పైగా గాయపడ్డారు. ఈ దుర్ఘటనకు సంబంధించి బాధితుల వివరాలు తెలుసుకునేందుకు ఆంధ్రప్రదేశ్‌లోని ప్రధాన స్టేషన్లలో రైల్వేశాఖ ప్రత్యేక హెల్ప్‌లైన్‌ నంబర్లు ఏర్పాటు చేసింది. మరోవైపు కోల్‌కతా, ఒడిశా నుంచి వచ్చే రైళ్ల కోసం విశాఖ రైల్వే స్టేషన్‌లో ప్రయాణికులు నిరీక్షిస్తున్నారు. 

విశాఖలో హెల్ప్‌లైన్‌ నంబర్లు: 08912746330, 08912744619
విజయనగరం: 08922-221202, 08922-221206
విజయవాడ: 0866 2576924
రాజమహేంద్రవరం: 08832420541 
సికింద్రాబాద్‌: 040-27788516
రేణిగుంట: 9949198414
తిరుపతి: 7815915571

పలు రైళ్ల దారి మళ్లింపు..

రైలు ప్రమాదం దృష్ట్యా పలు రైళ్లను దారి మళ్లించారు. (12840) చెన్నై సెంట్రల్‌-హౌరా రైలు జరోలీ మీదుగా దారి మళ్లించారు. (18048) వాస్కోడిగామ-షాలిమర్‌ రైలు కటక్‌, సలగోన్‌, అంగుల్‌ మీదుగా మళ్లించారు. (22850) సికింద్రాబాద్‌-షాలిమార్‌ వీక్లీ రైలు కటక్‌, సలగోన్‌, అంగుల్‌ మీదుగా మళ్లించినట్టు రైల్వే అధికారులు వెల్లడించారు. 

 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని