Andhra News: కాకినాడ జిల్లాలో దంపతులు అదృశ్యం.. క్వారీ వద్ద కనిపించిన మృతదేహం!
కాకినాడ జిల్లా రౌతులపూడి ఎస్ పైడిపాల శివారులో అదే గ్రామానికి చెందిన దంపతులు పోలోజు వరహాలు, లక్ష్మీ దుర్గా భవాని బుధవారం సాయంత్రం నుంచి అదృశ్యమయ్యారు.
రౌతులపూడి : కాకినాడ జిల్లా రౌతులపూడి ఎస్ పైడిపాల శివారులో అదే గ్రామానికి చెందిన దంపతులు పోలోజు వరహాలు, లక్ష్మీ దుర్గా భవాని బుధవారం సాయంత్రం నుంచి అదృశ్యమయ్యారు. రోజూ వీరిద్దరూ గ్రామానికి సమీపంలోని క్వారీ వద్దకు బహిర్భూమికి వెళ్లేవారు. ఈ క్రమంలో బుధవారం సాయంత్రం ఇంటి నుంచి వెళ్లిన వీరు ఎంత సేపటికీ తిరిగి రాలేదు. దీంతో వారి బంధువులు ఆందోళనకు గురై క్వారీ వద్ద ఇవాళ గాలించగా ద్విచక్ర వాహనం కనిపించింది. పేలిన బండరాళ్ల వద్ద ఒకరి మృతదేహం కనిపించింది. మరొకరి కోసం గాలిస్తున్నారు. పేలుడు సంభవించిన క్వారీ చాలా రోజులుగా మూసివేసి ఉంది. బుధవారం క్వారీ తెరిచిన నిర్వాహకులు పేలుళ్లు జరపగా.. అటుగా వెళ్లిన దంపతులు ప్రమాదం బారిన పడినట్లు తెలుస్తోంది. కనిపించిన మృతదేహం ఎవరిదనే దానిపై స్పష్టత రావాల్సి ఉంది.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
India News
Padma Shri: ‘పద్మశ్రీ’ వరించినా.. పక్కా ఇల్లు మాత్రం రాలేదు..!
-
Movies News
Pathaan: 32 ఏళ్ల తర్వాత అక్కడ హౌస్‌ఫుల్ బోర్డు.. ‘పఠాన్’ అరుదైన రికార్డు
-
Politics News
CM KCR: కేసీఆర్ సమక్షంలో భారాసలో చేరిన ఒడిశా మాజీ సీఎం గిరిధర్ గమాంగ్
-
India News
Go First Airways: 55 మందిని వదిలేసిన గో ఫస్ట్ ఎయిర్వేస్కు భారీ జరిమానా
-
Movies News
Rakesh - Sujatha: ‘జబర్దస్త్’గా రాకింగ్ రాకేశ్- సుజాత నిశ్చితార్థం.. తారల సందడి
-
General News
Telangana News: మంత్రి పువ్వాడ అజయ్‌కు కోర్టు ధిక్కరణ కేసులో నోటీసు