చిన్నారికి వేధింపులు.. వృద్ధ జంటకు జైలు

అభం శుభం తెలియని నాలుగేళ్ల చిన్నారిని లైంగికంగా వేధించిన కేసులో 80 ఏళ్ల వృద్ధ జంటకు మహారాష్ట్ర ప్రత్యేక న్యాయస్థానం 10 ఏళ్ల జైలు శిక్ష విధించింది. ఈ మేరకు న్యాయమూర్తి రేఖా ఎన్‌ పందారే పోక్సో చట్టం ప్రకారం శుక్రవారం తీర్పును వెలువరించారు. ఎనిమిదేళ్ల కింద..

Published : 13 Mar 2021 01:15 IST

ముంబయి: అభం శుభం తెలియని నాలుగేళ్ల చిన్నారిని లైంగికంగా వేధించిన కేసులో 80 ఏళ్ల వృద్ధ జంటకు మహారాష్ట్ర ప్రత్యేక న్యాయస్థానం 10 ఏళ్ల జైలు శిక్ష విధించింది. ఈ మేరకు న్యాయమూర్తి రేఖ పోక్సో చట్టం ప్రకారం శుక్రవారం తీర్పును వెలువరించారు. ఎనిమిదేళ్ల కిందట జరిగిన ఈ ఘటనకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి.

2013 సెప్టెంబర్‌ 4న పాఠశాల నుంచి మధ్యాహ్నం ఇంటికి వచ్చిన నాలుగేళ్ల చిన్నారి తొలుత భోజనం చేసి తన స్నేహితురాలితో ఆడుకోవడానికి అదే అపార్టుమెంటులోని నాలుగో అంతస్తుకు వెళ్లింది. ఆ సమయంలో తన స్నేహితురాలు నిద్రించి ఉండడంతో తిరిగి వస్తున్న క్రమంలో తాత-నాన్నమ్మ అంటూ ముద్దుగా పిలుచుకునే వృద్ధ దంపతులు చిన్నారిని ఆపారు. స్నేహంగా మాట్లాడుతూ ఇంట్లోని ఓ గదిలోకి తీసుకెళ్లారు. అక్కడ చిన్నారిని వివస్త్రను చేసి, వారించినందుకు కొడుతూ లైంగికంగా వేధించారు. ఈ ఘటనలో వృద్ధుడి భార్య సహకరించడం గమనార్హం. అయితే, వృద్ధ దంపతుల చేష్టల నుంచి తప్పించుకున్న చిన్నారి.. రాత్రి తన తల్లికి ఈ విషయాన్ని తెలియజేసింది. చిన్నారి లోదుస్తులను విప్పి చూడగా విషయం బయటకొచ్చింది. అనంతరం తన భార్తతో కలిసి ఆమె స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా.. ఆ మరుసటి రోజు దంపతులిద్దరినీ పోలీసులు అరెస్టు చేశారు. దాదాపు 8 ఏళ్ల తర్వాత కేసులో తీర్పు వెలువడింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని