Andhra News: చింతూరులో దంపతుల దారుణ హత్య

అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరు మండలం రత్నాపురం గ్రామంలో దంపతులు దారుణ హత్యకు గురయ్యారు.

Published : 31 Jul 2022 11:30 IST

చింతూరు: అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరు మండలం రత్నాపురం గ్రామంలో దంపతులు దారుణ హత్యకు గురయ్యారు. తమ గుడిసెలో నిద్రిస్తున్న దూబి రంగయ్య(51), ముత్తమ్మ(45) ఆదివారం ఉదయం రక్తపు మడుగులో కనిపించారు. శనివారం అర్ధరాత్రి దాటిన తరువాత దుండగులు వారిని హతమార్చి ఉంటారని భావిస్తున్నారు. గ్రామస్థుల నుంచి సమాచారం అందుకున్న పోలీసులు.. కాకినాడ నుంచి క్లూస్‌ టీంను రప్పించారు. దంపతుల హత్యకు ఏయే అంశాలు కారణమై ఉంటాయనే దానిపై ఆరా తీస్తున్నారు. 

Read latest Crime News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని