కృష్ణా జిల్లాలో దారుణం.. దంపతులను నరికి చంపిన దుండగులు

కృష్ణా జిల్లా మొవ్వ మండలం అయ్యంకిలో దారుణం చోటుచేసుకుంది. దంపతులను ప్రత్యర్థులు నరికి చంపారు.

Updated : 21 Sep 2023 14:58 IST

కూచిపూడి: కృష్ణా జిల్లా మొవ్వ మండలం అయ్యంకిలో దారుణం జరిగింది. పాత కక్షల నేపథ్యంలో భార్యాభర్తలను దుండగులు దారుణంగా నరికి చంపారు. అయ్యంకి పంచాయతీ కార్యాలయం వద్ద భర్త వీరంకి వీరకృష్ణను హత్య చేయగా.. నడిరోడ్డుపైనే అతడి భార్య వరలక్ష్మిని కిరాతకంగా నరికి చంపారు.

ఘటనా స్థలానికి చేరుకున్న కూచిపూడి పోలీసులు.. పాత కక్షలు నేపథ్యంలోనే జంట హత్యలు జరిగినట్లు ప్రాథమికంగా తేల్చారు. ఈ హత్యలతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. అన్ని కోణాల్లో దర్యాప్తు ప్రారంభించామని పోలీసులు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని