
షాకింగ్: కారు కొనేందుకు పసివాడిని అమ్మేశారు!
కాన్పూర్: యూపీలో షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. కారు కొనేందుకు ఓ జంట తమ కన్నపేగునే అమ్మకానికి పెట్టిన హృదయ విదారక ఘటన కన్నౌజ్ జిల్లా తిర్వా కొట్వాలి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఆ పసికందు అమ్మమ్మ, తాతయ్య గురువారం పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేయడంతో ఈ విషయం వెలుగుచూసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
సతౌర్‌కి చెందిన ఓ మహిళ మూడు నెలల క్రితం మగ శిశువుకి జన్మనిచ్చింది. అయితే, కారు కొనుగోలు చేసేందుకు గురుసాహైగంజ్‌కు చెందిన ఓ వ్యాపారవేత్తకు తన కుమార్తె, అల్లుడు కలిసి పసివాడిని రూ.1.5లక్షలకు విక్రయించినట్టు ఆ మహిళ తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. ఆ శిశువు ఇప్పటికీ వ్యాపారి వద్దే ఉన్నాడని ఇన్‌స్పెక్టర్ శైలేంద్ర కుమార్ మిశ్రా తెలిపారు. శిశువును అమ్మకానికి పెట్టిన ఆ దంపతులను విచారణ కోసం పిలిచినట్టు ఆయన వెల్లడించారు. ఇటీవలే ఆ దంపతులు పాత కారును కొనుగోలు చేసినట్టు గుర్తించామన్నారు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.