Vizag : ఆత్మహత్య చేసుకుంటామని బంధువులకు సెల్ఫీ వీడియో పంపిన దంపతులు..
ఆత్మహత్య చేసుకుంటామని ఓ దంపతులు సెల్ఫీవీడియో తీసి బంధువులకు పంపారు. ఈ ఘటన విశాఖలో చోటుచేసుకుంది.
విశాఖ: ఆత్మహత్య చేసుకుంటామని ఓ దంపతులు సెల్ఫీవీడియో తీసి బంధువులకు పంపారు. ఈ ఘటన విశాఖలో చోటుచేసుకుంది. స్థానిక తిరుమల నగర్‌లో ఉంటున్న స్టీల్‌ప్లాంట్ ఉద్యోగి చిత్రాడ వరప్రసాద్(47), మీరా(41) దంపతులు ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్య చేసుకుంటున్నట్లు సెల్ఫీ వీడియోలో పేర్కొన్నారు. దీంతో వారి కుమారుడు కృష్ణ సాయితేజ దువ్వాడ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసి గాలింపు చర్యలు చేపట్టారు. అనకాపల్లి కొప్పాక ఏలూరు కాల్వ వద్ద చెప్పులు, హ్యాండ్ బ్యాగు, మొబైల్ గుర్తించారు. మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
AP Voter List: ఎన్నికల నిర్వహణ ప్రక్రియను ఉపాధ్యాయులకే అప్పగించండి: సీఎఫ్‌డీ
-
Rolls Royce: యువకుడి నైపుణ్యం.. మారుతి కారుని రోల్స్ రాయిస్‌గా మార్చేశాడు
-
Mummy mystery: 128 ఏళ్ల క్రితం చనిపోయాడు.. ఇప్పుడు అంత్యక్రియలు!
-
Hyundai Airbags: హ్యుందాయ్ అన్ని కార్లలో ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు
-
Vedanta: విభజన సరే.. అప్పుల సంగతో..!: వేదాంతాపై క్రెడిట్‌సైట్స్
-
Chocolate: చనిపోతావని జాతకం చెప్పి.. చాక్లెట్‌తో చంపేసి..!