‘జోకర్’తో జాగ్రత్త: సీపీ అంజనీకుమార్‌

సైబర్‌ నేరగాళ్లు జోకర్‌ పేరుతో మాలిషియస్‌ మాల్‌ వేర్‌ను ప్రవేశపెట్టి  మోసాలకు పాల్పడే ప్రమాదముందని హైదరాబాద్‌ సీపీ అంజనీకుమార్‌ హెచ్చరించారు. ముంబయిలో గత 3నెలలుగా ఈతరహా మోసాలు విపరీతంగా పెరిగాయని, వందల సంఖ్యలో యువత జోకర్‌ మాల్‌వేర్‌ వల్ల డబ్బులు కోల్పోయారని అంజనీకుమార్‌ తెలిపారు...

Updated : 17 Jun 2021 13:08 IST

హైదరాబాద్‌: సైబర్‌ నేరగాళ్లు జోకర్‌ పేరుతో మాలిషియస్‌ మాల్‌ వేర్‌ను ప్రవేశపెట్టి  మోసాలకు పాల్పడే ప్రమాదముందని హైదరాబాద్‌ సీపీ అంజనీకుమార్‌ హెచ్చరించారు. ముంబయిలో గత 3నెలలుగా ఈతరహా మోసాలు విపరీతంగా పెరిగాయని, వందల సంఖ్యలో యువత జోకర్‌ మాల్‌వేర్‌ వల్ల డబ్బులు కోల్పోయారని అంజనీకుమార్‌ తెలిపారు. జోకర్‌  మాలిషియస్‌ మాల్‌వేర్‌ను గూగుల్‌ సంస్థ బ్లాక్‌ చేసిందని, ప్లే స్టోర్‌ నుంచి పలు దఫాలుగా తొలగించినా.. సైబర్‌ నేరగాళ్లు వేర్వేరు పేర్లతో మాల్‌వేర్‌ను ప్రవేశపెట్టి మోసాలకు పాల్పడుతున్నట్టు సీపీ వెల్లడించారు. అనుమానాస్పద లింకులు, గుర్తు తెలియని వ్యక్తులు పంపే సందేశాలు, లింకులను చూడొద్దని అంజనీకుమార్‌ తెలిపారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని