దోషులెవరైనా వదిలేది లేదు: సజ్జనార్‌

బోధన్‌ పాస్‌పోర్టు కేసులో విచారణ వేగవంతం చేసినట్లు సైబరాబాద్‌ సీపీ సజ్జనార్‌ తెలిపారు. దీనికోసం ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ..

Updated : 23 Feb 2021 11:55 IST

బోధన్‌ పాస్‌పోర్ట్‌ కేసు విచారణ వేగవంతం: సీపీ

హైదరాబాద్‌: బోధన్‌ పాస్‌పోర్టు కేసులో విచారణ వేగవంతం చేసినట్లు సైబరాబాద్‌ సీపీ సజ్జనార్‌ తెలిపారు. దీనికోసం ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఈ వ్యవహారంలో ఇప్పటివరకు 8 మందిని అరెస్ట్‌ చేశామన్నారు. ఈ మేరకు సీపీ మీడియాతో మాట్లాడారు. అరెస్టైన వారిలో నలుగురు బంగ్లాదేశీయులు, పశ్చిమబెంగాల్‌కు చెందిన ఓ వ్యక్తి, ఓ ఏజెంట్‌, ఇద్దరు స్పెషల్‌ బ్రాంచ్‌ అధికారులు ఉన్నారన్నారు. ఒకే అడ్రస్‌పై 32 పాస్‌పోర్టులు జారీ అయ్యాయని చెప్పారు.

దీనిపై ఇమ్మిగ్రేషన్‌, రీజినల్‌ పాస్‌పోర్టు అధికారులకు సమాచారం ఇచ్చామన్నారు. ఎంతమంది పాస్‌పోర్టు పొందారు? ఎంతమంది దేశం విడిచి వెళ్లారనే విషయాలపై విచారణ జరుపుతున్నామని తెలిపారు. అరెస్ట్‌ చేసిన నిందితులను రిమాండ్‌కు పంపించామని సీపీ చెప్పారు. ఈ వ్యవహారంలో దోషులు ఎవరైనా వదిలేదిలేదని ఆయన స్పష్టం చేశారు. కేసులో విచారణ ముమ్మరంగా సాగుతోందని సజ్జనార్‌ చెప్పారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని