Andhra News: బాలికపై లైంగిక వేధింపులు.. ఇద్దరు క్రికెట్‌ కోచ్‌లపై సస్పెన్షన్‌ వేటు

వైఎస్ఆర్ జిల్లా ప్రొద్దుటూరులో ఇద్దరు క్రికెట్‌ కోచ్‌లు సస్పెన్షన్‌కు గురయ్యారు. బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారనే ఆరోపణలు రావడంతో....

Updated : 23 Jun 2022 13:48 IST

ప్రొద్దుటూరు (నేరవార్తలు): వైఎస్ఆర్ జిల్లా ప్రొద్దుటూరులో ఇద్దరు క్రికెట్‌ కోచ్‌లు సస్పెన్షన్‌కు గురయ్యారు. బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారనే ఆరోపణలు రావడంతో కడప క్రికెట్ అసోసియేన్ విచారణ చేపట్టింది. విచారణ అనంతరం ఇద్దరినీ సస్పెండ్ చేసినట్లు ప్రొద్దుటూరు క్రికెట్ యూత్ క్లబ్ నాయకులు తెలిపారు. సస్పెండ్‌ అయిన కోచ్‌ల బాధ్యతలను మహిళా కోచ్‌కు అప్పగించారు. కడప క్రికెట్ అసోసియేషన్ అనుసంధానంతో నడుస్తున్న ప్రొద్దుటూరు సబ్ సెంటర్‌లో బాలిక కొన్ని రోజులుగా శిక్షణ తీసుకుంటోంది. బాలికపై లైంగిక వేధింపుల ఆరోపణలు వెలుగులోకి రావడంతో పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని