Hyderabad: హైదరాబాద్‌లో 24 గంటల్లో 5 హత్యలు!

నగరంలో రోజూ ఏదో చోట నేరాలు జరుగుతున్నాయి. గత 24 గంటల వ్యవధిలోనే హైదరాబాద్‌ పరిధిలో 5 హత్యలు, 2 హత్యాయత్నాలు చోటు చేసుకున్నాయి.

Updated : 20 Jun 2024 10:54 IST

హైదరాబాద్‌: నగరంలో రోజూ ఎక్కడో ఒక చోట నేరాలు జరుగుతున్నాయి. గత 24 గంటల వ్యవధిలోనే హైదరాబాద్‌ పరిధిలో 5 హత్యలు, 2 హత్యాయత్నాలు చోటు చేసుకున్నాయి. పాతబస్తీ శాలిబండ పోలీసు స్టేషన్ పరిధిలో నిమ్రా ఫాస్ట్‌ఫుడ్‌ సెంటర్‌ యజమాని రఫీక్ దారుణ హత్యకు గురయ్యాడు. శాలిబండ పోలీసు స్టేషన్ పరిధిలో వజీద్, ఫక్రుద్దీన్‌పై హత్యాయత్నం జరిగింది. 

సికింద్రాబాద్‌లోని తుకారాం గేట్ పోలీసు స్టేషన్ పరిధి అడ్డగుట్టలో రోజాను ఆమె భర్త హత్య చేశాడు. ఆసిఫ్‌నగర్‌లో అలీం అనే వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. కాచిగూడ పోలీసు స్టేషన్ పరిధిలో ఖిజార్ అనే వ్యక్తిని దుండగులు హతమార్చారు. సనత్ నగర్ పోలీసు స్టేషన్ పరిధిలోని భరత్ నగర్‌లో అజార్ అనే వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. ఈ ఘటనలపై పోలీసులు కేసులు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని