Crime News: కిచిడీలో మత్తుమందు కలిపి.. 17 మంది విద్యార్థినులపై లైంగికదాడి

ఉత్తర్‌ప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్‌ జిల్లాలో ఓ ప్రైవేటు పాఠశాల నిర్వాహకుడు, అతడి సహాయకుడిపైన 17 మంది పదో తరగతి విద్యార్థినులకు మత్తుమందు ఇచ్చి లైంగికదాడికి పాల్పడ్డారని కేసు నమోదైంది. జిల్లాలోని పుర్కాజి పోలీసుస్టేషను....

Updated : 08 Dec 2021 14:00 IST

యూపీలో పాఠశాల నిర్వాహకుడి నిర్వాకం
‘ఈటీవీ భారత్‌’ కథనం సుమోటోగా స్వీకరణ

ఈనాడు, లఖ్‌నవూ: ఉత్తర్‌ప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్‌ జిల్లాలో ఓ ప్రైవేటు పాఠశాల నిర్వాహకుడు, అతడి సహాయకుడిపైన 17 మంది పదో తరగతి విద్యార్థినులకు మత్తుమందు ఇచ్చి లైంగికదాడికి పాల్పడ్డారని కేసు నమోదైంది. జిల్లాలోని పుర్కాజి పోలీసుస్టేషను పరిధిలో ఈ సంఘటన జరిగింది. ఈ ఘటనపై ‘ఈటీవీ భారత్‌’ ఇచ్చిన కథనాన్ని సుమోటోగా పరిగణించిన ఉత్తర్‌ప్రదేశ్‌ మహిళా కమిషన్‌ సత్వర చర్యలు చేపట్టింది. కేసుకు సంబంధించిన అన్ని వివరాలను తమకు నివేదించాలని ముజఫర్‌నగర్‌ జిల్లా మెజిస్ట్రేట్‌తోపాటు అధికారులను ఆదేశించింది. ‘ఈటీవీ భారత్‌’ కథనం ఆధారంగా ఈ ఘటనను సుమోటోగా పరిగణిస్తున్నామని లేఖలో పేర్కొంది. వివరాల్లోకి వెళితే.. ఓ పాఠశాలలో చదువుతున్న 17 మంది బాలికలను ప్రాక్టికల్‌ పరీక్షల నిమిత్తం ఆ పాఠశాల నిర్వాహకుడు మరో పాఠశాలకు తీసుకువెళ్లాడు. ఆలస్యమవుతుందనే కారణంగా రాత్రి బస అక్కడే ఏర్పాటు చేసి మత్తుమందు కలిపిన కిచిడీ పెట్టారు. ఆ తర్వాత బాలికలపై అత్యాచారానికి యత్నించారని పోలీసులు తెలిపారు. ఈ సంఘటన సుమారు పదిహేడు రోజుల కిందట జరిగింది. బాలికలు భయపడి పాఠశాలకు వెళ్లకపోవడంతో తల్లిదండ్రులు ఆరా తీయగా.. అసలు విషయం బయటపడింది. స్థానిక ఎమ్మెల్యే సహకారంతో సోమవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితులపై పోక్సో కేసులు నమోదయ్యాయి. పాఠశాల నిర్వాహకుడిని అరెస్టు చేసి, అతడి సహాయకుడి కోసం గాలింపు చర్యలు మొదలుపెట్టారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని