HYD: ట్విటర్‌కు సైబర్ క్రైమ్ పోలీసుల షాక్

హీరోయిన్ మీరాచోప్రాపై అసభ్యకరమైన పోస్టులు చేసిన కేసులో ట్విట్టర్‌కి హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు నోటీసులు ఇచ్చారు. గతేడాది ఆమెపై కొందరు అసభ్యకరమైన సందేశాలు పెట్టగా, వారిపై చర్యలు తీసుకోవాలని చోప్రా ఫిర్యాదు ...

Published : 19 Jun 2021 01:11 IST

హైదరాబాద్: హీరోయిన్ మీరాచోప్రాపై అసభ్యకరమైన పోస్టులు చేసిన కేసులో ట్విటర్‌కి హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు నోటీసులు ఇచ్చారు. గతేడాది ఆమెపై కొందరు అసభ్యకరమైన సందేశాలు పెట్టగా, వారిపై చర్యలు తీసుకోవాలని చోప్రా ఫిర్యాదు చేశారు. ఆ పోస్టులను తొలగించిన ట్విటర్‌.. నిందితుల ఐపీ అడ్రస్ ఇవ్వకుండా ఆలస్యం చేసింది. వారి సమాచారం ఇవ్వాలని పోలీసులు నోటీసులు జారీ చేసినా స్పందించలేదు. తాజాగా కేంద్ర ప్రభుత్వ చట్టం ప్రకారం ట్విటర్‌కు పోలీసులు నోటీసులు పంపారు. యాజమాన్యం ఇచ్చే వివరణను బట్టి ముందుకెళ్తామని సైబర్ క్రైమ్ ఏసీపీ ప్రసాద్ తెలిపారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని