Cyber Crime: మీ ఖాతాలో డబ్బులు పోయాయా?.. వెంటనే ఇలా చేయండి

సైబర్‌ నేరాలు రోజురోజుకూ పెరుగుతున్న వేళ సైబర్‌ క్రైం పోలీసులు ప్రజలను మరోసారి అప్రమత్తం చేశారు. నేరం జరిగిన వెంటనే ఫిర్యాదు చేస్తే పోయిన డబ్బులు తిరిగివచ్చే

Published : 01 Jul 2022 02:10 IST

హైదరాబాద్‌: సైబర్‌ నేరాలు రోజురోజుకూ పెరుగుతున్న వేళ సైబర్‌ క్రైం పోలీసులు ప్రజలను మరోసారి అప్రమత్తం చేశారు. నేరం జరిగిన వెంటనే ఫిర్యాదు చేస్తే పోయిన డబ్బులు తిరిగివచ్చే అవకాశం ఉందని వెల్లడించారు. ఈ మేరకు నేషనల్‌ సైబర్‌ క్రైం పోర్టల్‌లో కానీ, హెల్ప్‌లైన్‌ నంబర్‌ 1930కి వెంటనే ఫిర్యాదు చేయాలని సూచించారు. తద్వారా బాధితుడి ఖాతా నుంచి బదిలీ అయిన నగదును ఇతర ఖాతాలకు బదిలీ అవ్వకుండా చేయవచ్చని తెలిపారు. సత్వరమే ఫిర్యాదు చేసేందుకు గతేడాది జూన్‌లో తెలంగాణ సైబర్‌ క్రైం కోఆర్డినేషన్‌ సెంటర్‌ ఏర్పాటు చేసినట్లు వివరించారు. ఈ కాల్‌ సెంటర్‌ 24/7 అందుబాటులో ఉంచామని పోలీసులు తెలిపారు. ఇప్పటివరకూ సైబర్ నేరగాళ్లు కాజేసిన ₹15.48 కోట్లను వారి ఖాతాల్లో నిలుపుదల చేశామన్నారు. ఆర్ధిక పరమైన ఫిర్యాదులను నమోదు చేసిన వెంటనే అవి సీఎఫ్‌ఆర్‌ఎంఎస్‌లోకి వెళతాయని, దీంతో వెంటనే సంబంధిత నేరగాళ్ల ఖాతాల్లోని నగదు సీజ్ అవుతుందని సైబర్‌ క్రైం పోలీసులు వివరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని