Anchor anasuya: యాంకర్ అనసూయ ఫిర్యాదు.. నిందితుడి అరెస్టు
ప్రముఖ యాంకర్ అనసూయ ఫిర్యాదు మేరకు సినీనటులు, యాంకర్ల పొటోలు మార్ఫింగ్ చేసి అసభ్యకర పదజాలంతో సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేస్తున్న వ్యక్తిని సైబరాబాద్ సైబర్ క్రైం పోలీసులు అరెస్టు చేశారు.
హైదరాబాద్: సినీనటులు, యాంకర్ల ఫొటోలు మార్ఫింగ్ చేసి అసభ్యకర పదజాలంతో సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేస్తున్న వ్యక్తిని సైబరాబాద్ సైబర్ క్రైం పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడిని ఏపీలోని కోనసీమ జిల్లా పాసలపూడి గ్రామానికి చెందినవాడిగా గుర్తించారు. అతడిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. నిందితుడి తీరుపై ఈ నెల 17న సైబర్ క్రైం పోలీసులకు యాంకర్ అనుసూయ ఫిర్యాదు చేశారు. దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. నకిలీ ట్విటర్ ఖాతా నుంచి 267 హీరోయిన్ల ఫొటోలను మార్ఫింగ్ చేసి పోస్టు చేసినట్లు గుర్తించి నిందితుడిని అరెస్టు చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
Nalgonda: ఆర్పీఎఫ్ ఎస్ఐగా చలామణి.. పెళ్లి చూపుల్లో బయటపడిన యువతి మోసం
ఆర్పీఎఫ్ ఎస్ఐగా చలామణి అవుతున్న ఓ యువతిని నల్గొండ రైల్వే పోలీసులు అరెస్టు చేశారు. -
Bengaluru: బెంగళూరులో పేలుడు పదార్థాలు స్వాధీనం
బెంగళూరులో పేలుడు పదార్థాలు వెలుగు చూసిన ఘటన కలకలం రేపింది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. -
Hyd News: నకిలీ సాస్‌లు తయారు చేస్తున్న ముఠా అరెస్టు
శంషాబాద్ పరిధిలో నకిలీ సాస్‌లు తయారు చేస్తున్న ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. -
వైకాపా మూకల దాడిలో గాయపడిన తెదేపా కార్యకర్త మృతి
వైకాపా మూకల దాడిలో తీవ్రంగా గాయపడిన తెదేపా కార్యకర్త మునయ్య మృతిచెందారు. ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలం పరమేశ్వరనగర్‌లో సోమవారం ఆయనపై వైకాపా కార్యకర్తలు దాడి చేశారు. -
వంట త్వరగా చేయలేదని భార్యను హతమార్చి.. ఆపై ఆత్మహత్య
వంట చేయడంలో ఆలస్యం అయిందని ఓ వ్యక్తి భార్యను పదునైన ఆయుధంతో చంపేశాడు. అనంతరం భయంతో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. -
అధిక వడ్డీల ఆశజూపి.. భారీ మోసం!
తమ సంస్థలో పెట్టుబడులు పెడితే.. అధిక వడ్డీతో పాటు తక్కువ సమయంలోనే భారీగా ఆర్జించవచ్చని మాయమాటలతో నమ్మించిన దంపతులు బోర్డు తిప్పేసిన ఘటన హైదరాబాద్ ఉప్పల్‌లో చోటుచేసుకుంది. -
కోల్‌కతాలో కుప్పకూలిన అయిదంతస్తుల భవనం.. తొమ్మిది మంది మృతి
పశ్చిమబెంగాల్ రాజధాని కోల్‌కతాలో నిర్మాణంలో ఉన్న ఓ అయిదంతస్తుల భవనం కుప్పకూలింది. ఈ ఘటనలో తొమ్మిది మంది మృతిచెందగా.. 17 మంది తీవ్రంగా గాయపడ్డారు. -
హార్డ్‌డిస్కులను అడవిలో పడేసిన ప్రణీత్‌రావు!
స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచి (ఎస్సైబీ)లోని హార్డ్‌డిస్కులను కట్టర్లతో కత్తిరించి, వికారాబాద్ అడవిలో పడేసినట్లు రెండోరోజు విచారణలో డీఎస్పీ ప్రణీత్‌రావు ఒప్పుకొన్నట్లు తెలుస్తోంది. -
పెళ్లి కారు, ట్రాక్టర్ ఢీ.. బిహార్‌లో 9 మంది మృతి
బిహార్‌లోని ఖగారియా జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ట్రాక్టర్, పెళ్లి కారు ఢీ కొన్న ఘటనలో 9 మంది మరణించారు. -
నకిలీ ఔషధ రాకెట్ కేసులో ఈడీ దాడులు
దేశ రాజధాని దిల్లీలో బయటపడిన నకిలీ ఔషధ రాకెట్ గుట్టును ఛేదించే క్రమంలో ఈడీ దాదాపు 10 ప్రదేశాల్లో దాడులు చేసింది. ముఠా ప్రధాన సూత్రధారులు విపిల్ జైన్, నీరజ్ చౌహన్, సూరజ్ షాత్, అభినవ్, తుషార్ చౌహాన్‌లతో సహా వారి సహచరుల ఇళ్లల్లోను ఈడీ దాడులు చేసింది. -
రూ.5.73 కోట్ల విలువైన బంగారం స్వాధీనం
నల్గొండ జిల్లా మిర్యాలగూడ ఈదులగూడ వద్ద సోమవారం పట్టణం నుంచి కోదాడ వైపు వెళ్తున్న టీఎస్ 09 యూఈ 2479 నంబరు గల బొలేరో వాహనంలో రూ.5.73 కోట్ల విలువ చేసే బంగారాన్ని స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ చందనా దీప్తి పేర్కొన్నారు. -
ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ వద్ద చోరీ.. ఆపై అడ్డంగా దొరికారు
ఓ వ్యక్తి మెడలో ఉన్న గొలుసును చోరీ చేసిన ఇద్దరు దొంగలు చివరకు పోలీసుల చేతికి చిక్కి, కటకటాల పాలయ్యారు.
తాజా వార్తలు (Latest News)
-
Vodafone Idea: ₹169 రీఛార్జితో 90 రోజుల డిస్నీ సబ్స్క్రిప్షన్.. వొడా కొత్త ప్లాన్
-
PM Modi: సేలం సభలో ప్రధాని మోదీ భావోద్వేగం
-
Top Ten News @ 5 PM: ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు
-
Salman Khan: సల్మాన్ ఖాన్- అట్లీ కాంబో.. అర్బాజ్ ఖాన్ ఏమన్నారంటే?
-
నాడు హిట్లర్‌ను అరెస్టు చేసిన జాన్.ఎఫ్. కెనడీ.. వైరల్ అవుతున్న ఈసీ పోస్ట్
-
IPL: ఐపీఎల్ 2024 సీజన్. కోహ్లీ కొత్త హెయిర్‌స్టైల్ అదుర్స్.. ఫొటోలు వైరల్