Andhra News: ఎమ్మెల్యేల నుంచి వసూళ్లు ... గాజువాకలో ప్రియురాలికి రూ.80లక్షలతో ఇల్లు

గాజువాక శ్రీనగర్‌లో సైబర్‌ నేరస్థుడు విష్ణుమూర్తి అలియాస్‌ సాగర్‌ను రాజస్థాన్‌ పోలీసులు అరెస్టు చేశారు.

Updated : 02 May 2022 06:05 IST

విశాఖపట్నం: రాజస్థాన్‌ రాష్ట్రానికి చెందిన ఓ ఎమ్మెల్యేకు ఫోన్‌ చేసి డబ్బులు డిమాండ్‌ చేసిన అభియోగాలపై విశాఖలోని గాజువాక శ్రీనగర్‌కు చెందిన నిందితుడిని అక్కడి పోలీసులు అరెస్టు చేశారు. పి.విష్ణుమూర్తి(20) (అలియాస్‌ సాగర్‌) ఇటీవల రాజస్థాన్‌కు చెందిన ఎమ్మెల్యే సందీప్‌ యాదవ్‌కు పలుమార్లు ఫోన్లు చేసి ముఖ్యమంత్రి అశోక్‌ గెహ్లాత్‌ కార్యాలయం నుంచి మాట్లాడుతున్నానని, రూ.20 లక్షలు పంపాలని కోరాడు. దీంతో ఆ ఎమ్మెల్యే సైబర్‌క్రైం పోలీసులకు సమాచారం ఇచ్చారు. అక్కడి బివాడీ పోలీస్‌స్టేషన్‌కు చెందిన సర్కిల్‌ ఇన్‌స్పెక్టరు జితేంద్రసింగ్‌ నేతృత్వంలో సిబ్బంది చరవాణి లోకేషన్‌ ఆధారంగా గాజువాక శ్రీనగర్‌లో నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ట్రాన్సిట్‌ వారెంట్‌పై నిందితుడిని రాజస్థాన్‌ తీసుకెళ్లారు.

సీఎంవో నుంచి మాట్లాడుతున్నానంటూ విష్ణుమూర్తి అక్కడి ఎమ్మెల్యేలకు ఫోన్‌ చేసి దాదాపు రూ.2.5కోట్లు వసూలు చేసినట్టు సమాచారం. ఎమ్మెల్యేల నుంచి వసూలు చేసిన డబ్బుల్లో రూ.80లక్షలతో ప్రియురాలికి గాజువాకలో  ఇల్లు కొన్నట్టు పోలీసుల దర్యాప్తులో తేలింది. విష్ణుమూర్తిపై గతంలోనూ విశాఖ సైబర్‌ క్రైం, కాశీబుగ్గ పీఎస్‌లో మొత్తం నాలుగు కేసులు ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. బీటెక్‌ కంప్యూటర్‌ సైన్స్‌ చదివిన నిందితుడు సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి 2019లోనూ ఏపీలో  ఇద్దరు మంత్రులు, ముగ్గురు ఎమ్మెల్యేల నుంచి రూ1.80 కోట్లు వసూలు చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని