TS news: ఉద్యోగాలు ఇస్తామని నమ్మించి.. దిల్లీ ముఠా మోసాలు
మోసాలకు పాల్పడుతున్న గేమింగ్,బెట్టింగ్ ముఠాను సైబరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. వారి ఖాతాల్లోని రూ.24 కోట్ల నగదును సీజ్ చేశారు.
హైదరాబాద్: సైబరాబాద్‌లో గేమింగ్, బెట్టింగ్ ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. డిసెంబరులో చేవెళ్లకు చెందిన హర్షవర్ధన్ అనే విద్యార్థి నుంచి రూ.98.47 లక్షలు ఈ ముఠా కాజేసింది. దిల్లీ కేంద్రంగా నడుస్తున్న ఈ దందాలో.. 9 మంది ముఠా సభ్యులను సైబర్ క్రైం పోలీసులు అరెస్టు చేశారు. వివిధ వెబ్‌సైట్ల ద్వారా నిరుద్యోగుల సమాచారాన్ని సేకరించి వారిని మోసం చేస్తున్నారని పోలీసులు తెలిపారు. నిందితుల ఖాతాల్లోని రూ.24 కోట్ల నగదును సీజ్ చేసినట్లు పేర్కొన్నారు. వారి నుంచి చెక్‌బుక్‌లు, 193 మొబైల్ ఫోన్లు, 98 స్టాంపులు, 23పీవోఎస్ యంత్రాలు, 21 ల్యాప్‌టాప్‌లు, డెబిట్ కార్డులను పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.
నిరుద్యోగుల సమాచారం సేకరించిన ముఠా సభ్యులు వారికి ఫోన్ చేసి ఉద్యోగం ఇస్తామని నమ్మిస్తున్నారని, ప్రాసెసింగ్ ఫీజుల, ఇతర ఖర్చుల కింది వారి నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారని పోలీసులు తెలిపారు. కొంత డబ్బు చెల్లించిన తర్వాత మోసపోయామని గుర్తించిన బాధితులు పోలీసులను ఆశ్రయిస్తున్నారని చెప్పారు. ఈ ముఠాపై లోతుగా దర్యాప్తు చేస్తున్నట్లు సైబరాబాద్ పోలీసులు వెల్లడించారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Politics News
Congress: ఓయూలో నిరుద్యోగ మార్చ్.. రేవంత్ సహా కాంగ్రెస్ నేతల గృహనిర్బంధం
-
India News
దర్యాప్తు సంస్థల దుర్వినియోగంపై.. సుప్రీంకు 14 విపక్ష పార్టీలు
-
Movies News
manchu manoj: ‘ఇళ్లల్లోకి వచ్చి ఇలా కొడుతుంటారండి’.. వీడియో షేర్ చేసిన మనోజ్
-
World News
WHO Vs Musk: మస్క్ X టెడ్రోస్.. ట్విటర్ వార్..!
-
Politics News
KTR: ఒక్క తెలంగాణలోనే పెట్టుబడికి రూ.10 వేలు.. పంట నష్టపోతే రూ.10 వేలు : కేటీఆర్
-
Politics News
Bandi Sanjay: నాకెలాంటి నోటీసూ అందలేదు.. నేను ఇవాళ రాలేను: సిట్‌కు బండి సంజయ్ లేఖ