Crime News: 80 మందితో కాల్‌ సెంటర్‌.. రూ.50 కోట్లకు పైగా టోకరా

నకిలీ కాల్ సెంటర్ నిర్వహిస్తూ అంతర్జాతీయ క్రెడిట్ కార్డు మోసాలకు పాల్పడుతున్న ముఠాను సైబరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు.

Updated : 15 Jan 2022 06:11 IST

 

హైదరాబాద్‌: నకిలీ కాల్ సెంటర్ నిర్వహిస్తూ అంతర్జాతీయ క్రెడిట్ కార్డు మోసాలకు పాల్పడుతున్న ముఠాను సైబరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. మొహాలీ, హైదరాబాద్‌కు చెందిన ఏడుగురిని అరెస్టు చేసినట్లు సైబరాబాద్‌ సీపీ స్టీఫెన్‌ రవీంద్ర తెలిపారు. వీరి నుంచి రూ.1.11 కోట్లు, పలు పరికరాలు స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. ఈ మేరకు ఈ కేసుకు సంబంధించిన వివరాలను సీపీ మీడియాకు వివరించారు.

సీపీ మాట్లాడుతూ.. ‘‘ఈ ముఠా 80 మందితో నకిలీ కాల్ సెంటర్ నిర్వహిస్తూ ఆన్‌లైన్‌లో క్రెడిట్ కార్డుల అమ్మకాలు చేస్తోంది. ఇంటర్నేషనల్ క్రెడిట్ కార్డులను టార్గెట్‌గా చేసుకొని మోసాలకు పాల్పడ్డారు. ఈ వ్యవహారంలో ఈ ముఠాకు చెందిన నవీన్ బొటాని కీలక పాత్ర పోషించారు. నవీన్‌ 2017లో ఆర్‌ఎన్‌ టెక్‌ సర్వీసెస్‌ అని ఒక కంపెనీని స్థాపించారు. ఇందులో 80 మందితో కాల్‌ సెంటర్‌ ఏర్పాటు చేశారు. దిల్లీ, మొహాలీ, ఘజియాబాద్‌లో కాల్ సెంటర్లు ఏర్పాటు చేశారు. యూకే, సింగపూర్‌, ఆస్ట్రేలియాకు చెందిన అంతర్జాతీయ క్రెడిట్‌ కార్డులు ఉన్నవారి సమాచారాన్ని ఈ ముఠా సేకరించింది. విదేశీ క్రెడిట్ కార్డుల కంపెనీలకు ఫ్రాంచైజీగా ఉన్న భారతీయ బ్యాంకులకు టోకరా వేశారు. ఇప్పటి వరకు ఈ ముఠా రూ.50 కోట్లకు పైగా మోసానికి పాల్పడ్డారు. దుబాయ్‌లో మరో 2 ముఠాలు ఉన్నట్లుగా గుర్తించాం’’ అని సీపీ వెల్లడించారు. ఈ కేసుకు సంబంధించి దర్యాప్తును మరింత ముమ్మరం చేసినట్లు సీపీ తెలిపారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు