Crime News: 98 కేసుల్లో నిందితులుగా ఉన్న అంతరాష్ట్ర దోపిడీ ముఠా అరెస్ట్‌

మధ్యప్రదేశ్‌లోని దార్‌ జిల్లాకు చెందిన అంతరాష్ట్ర దోపిడీ ముఠాను సైబరాబాద్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు.

Updated : 16 Jun 2022 14:10 IST

హైదరాబాద్‌: మధ్యప్రదేశ్‌లోని దార్‌ జిల్లాకు చెందిన అంతరాష్ట్ర దోపిడీ ముఠాను సైబరాబాద్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు. తాళం వేసి ఉన్న ఇళ్లలో దొంగతనాలకు పాల్పడుతున్న ముఠాలోని 11మందిని అరెస్ట్‌ చేసినట్లు సైబరాబాద్‌ సీపీ స్టీఫెన్‌ రవీంద్ర తెలిపారు. అరెస్ట్‌ చేసిన వారు 98 కేసుల్లో నిందితులుగా ఉన్నట్లు చెప్పారు. వీరిపై సైబరాబాద్‌లో 68, నిజామాబాద్‌లో 10, కరీంనగర్‌లో 02, వరంగల్‌లో 06, జగిత్యాలలో 09, కామారెడ్డిలో 02, సిద్దిపేటలో ఒక కేసు నమోదైందని వివరించారు.

ఈ 11 మంది ముఠాగా ఏర్పడి తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాల్లో దొంగతనాలకు పాల్పడుతున్నట్లు గుర్తించారు. భారీ కట్టర్స్, రాడ్స్, స్క్రూ డ్రైవర్స్‌తో వీళ్లు దొంగతనాలకు పాల్పడుతున్న సీపీ వివరించారు. ఈ ముఠాలో మరికొందరు ఉన్నారని.. వారిని త్వరలో అరెస్ట్‌ చేస్తామని స్టీఫెన్‌ రవీంద్ర వెల్లడించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని