Nizamabad: దారుణం.. తల్లిని రోకలిబండతో కొట్టి చంపిన కుమార్తె
నిజామాబాద్ జిల్లా నందిపేట్ మండలం ఉమ్మెడలో దారుణం జరిగింది. కన్నతల్లిని రోకలిబండతో కుమార్తె కొట్టి చంపింది.
నందిపేట్ గ్రామీణం: నిజామాబాద్ జిల్లా నందిపేట్ మండలంలో దారుణం జరిగింది. కుటుంబ కలహాలతో కన్నతల్లిని రోకలిబండతో కుమార్తె కొట్టి చంపిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసుల కథనం ప్రకారం.. ఉమ్మెడ గ్రామానికి చెందిన నాగం నర్సు (52) కూలి పనులు చేస్తూ జీవనం సాగిస్తోంది. ఆమె భర్త 20 ఏళ్ల క్రితం చనిపోవడంతో ఉమ్మెడ గ్రామంలో ఒంటరిగా ఉంటోంది. ఆమె ఇంట్లోనే ఒక గదిలో కుమార్తె నాగం హరిత(28) వేరుగా ఉం టోంది. తల్లి, కుమార్తె మధ్య గత కొన్నేళ్లుగా కుటుంబ విషయాల్లో గొడవలు జరుగుతున్నాయి.
ఈక్రమంలో ఈనెల 26న మధ్యాహ్నం మృతురాలి రెండో కుమార్తె అరుణ ఇంట్లో జరిగిన ఫంక్షన్‌కి వచ్చిన వారిని నాగం నర్సు దుర్భాష లాడింది. ఆ విషయంలో మృతురాలికి, పెద్ద కుమార్తె హరిత కు గొడవ జరిగింది. ఈగొడవలో కుమార్తె తల్లిని రోకలి బండతో ఇష్టం వచ్చినట్లు తల, ముఖంపై కొట్టి పడేసి వెళ్ళిపోయింది. మరుసటి రోజు 27న జరిగిన విషయాన్ని మృతురాలి పెద్ద కుమార్తె తన చెల్లెలికి, బంధువులకు ఫోన్ చేసి చెప్పింది. మధ్యాహ్నం మృతురాలి రెండో కుమార్తె, బందువులు వచ్చి చూడగా నర్సు చనిపోయి ఉంది. మృతురాలి మేనల్లుడు గణపురం రవి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆదివారం నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Sanju Samson: సంజూ శాంసన్ ఆ వైఖరిని మార్చుకోవాలి: శ్రీశాంత్
-
Hyderabad: సెల్‌ఫోన్ పోయిందని.. యువకుడి ఆత్మహత్య
-
S Jaishankar: జీ20 సారథ్యం ఆషామాషీ కాదు.. పెను సవాళ్లను ఎదుర్కొన్నాం: జైశంకర్
-
అవకాశం దొరికిన ప్రతిసారీ బ్రిజ్ భూషణ్ వేధింపులకు పాల్పడ్డాడు: దిల్లీ పోలీసులు
-
Vivek Agnihotri: నా సినిమాకు వ్యతిరేకంగా డబ్బులు పంచుతున్నారు: వివేక్ అగ్నిహోత్రి తీవ్ర ఆరోపణలు
-
Russia: పశ్చిమ దేశాలు నేరుగా రష్యాతో యుద్ధంలో ఉన్నాయి: సెర్గీ లవ్రోవ్