Hyderabad: సోషల్ మీడియాలో ట్రోలర్స్‌పై కేసులు నమోదు: డీసీపీ స్నేహా మెహ్రా
ప్రజాప్రతినిధులపై సోషల్ మీడియాలో అసత్య ట్రోల్స్ చేసిన 20మందిపై కేసులు నమోదు చేశామని, 8మందికి 41ఏ నోటీసులు జారీ చేశామని డీసీపీ స్నేహా మెహ్రా వెల్లడించారు.
హైదరాబాద్: మహిళల పట్ల అసభ్యంగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హైదరాబాద్ సైబర్ క్రైమ్ డీసీపీ స్నేహా మెహ్రా తెలిపారు. ప్రజాప్రతినిధులపై సోషల్ మీడియాలో అసత్య ట్రోల్స్ చేసిన 20మందిపై కేసులు నమోదు చేశామని, 8మందికి 41ఏ నోటీసులు జారీ చేశామని వెల్లడించారు. సబ్‌స్క్రైబర్లు, వీక్షణల కోసం మార్ఫింగ్ చేయడం చట్టరీత్యా నేరమని తెలిపారు. ఇటీవల ఎమ్మెల్సీ కవితను కించపర్చే విధంగా ట్రోలింగ్ జరిగిందని గుర్తించామన్నారు. కొంత మంది యువత సబ్‌స్క్రైబర్‌లను పెంచుకోవాలనే ఉద్దేశంతో ప్రజాప్రతినిధులపై మార్ఫింగ్ చేసిన వీడియోలను, అవమానకరమైన కంటెంట్‌ను ట్రోలింగ్ చేస్తున్నారని డీసీపీ వివరించారు. అసత్య ట్రోల్స్ చేసే ఛానెళ్లు, నిర్వాహకుల వివరాలను వెల్లడించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Google Bard- Team India: వన్డే ప్రపంచకప్.. గూగుల్ బార్డ్ టీమ్ఇండియా తుది జట్టు ఇదే
-
Social Look: ధోనీ - రామ్‌చరణ్ మీట్.. మాళవిక నో ఫిల్టర్ లుక్.. నిధి క్వీన్..!
-
TSLPRB: తెలంగాణ కానిస్టేబుల్ తుది ఫలితాలు విడుదల
-
Chandrababu Arrest: ఎన్టీఆర్ స్పందించకపోతే ఐ డోంట్ కేర్: బాలకృష్ణ
-
Jammu Kashmir: కుల్గాం జిల్లాలో ఎన్కౌంటర్.. ఇద్దరు ఉగ్రవాదులు హతం
-
Bombay HC: ఔషధాల కొరతతో మరణాలా..? ఆసుపత్రుల్లో మృత్యుఘోషపై బాంబే హైకోర్టు సీరియస్