dead bodies: గంగా నదిలో మళ్లీ మృతదేహాల కలకలం

గంగా నదిలో మరోసారి మృతదేహాలు తేలియాడటం కలకలం రేపుతోంది. ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఉన్నావ్‌ జిల్లాలోని గంగానదిలో మృతదేహాలు కొట్టుకురాగా స్థానికులు భయాందోళనకు గురయ్యారు. నీటి ఉద్ధృతి పెరగడంతో నది ఒడ్డున ఇసుకలో పాతిపెట్టిన కరోనా మృతదేహాలు నీటిలోకి కొట్టుకు వస్తుండవచ్చని స్థానికులు అనుమానిస్తున్నారు.

Published : 01 Jun 2021 01:37 IST

ఉన్నావ్‌: గంగా నదిలో మరోసారి మృతదేహాలు తేలియాడటం కలకలం రేపుతోంది. ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఉన్నావ్‌ జిల్లాలోని గంగానదిలో మృతదేహాలు కొట్టుకురాగా స్థానికులు భయాందోళనకు గురయ్యారు. నీటి ఉద్ధృతి పెరగడంతో నది ఒడ్డున ఇసుకలో పాతిపెట్టిన కరోనా మృతదేహాలు నీటిలోకి కొట్టుకు వస్తుండవచ్చని స్థానికులు అనుమానిస్తున్నారు. అయితే జిల్లాలో ఇలాంటి ఘటనలు జరగలేదని ఉన్నావ్‌ జిల్లా అధికారులు వెల్లడించారు. తాము నదీ పరివాహక ప్రాంతంలో గస్తీ నిర్వహించామని, నదిలో శవాలు కనిపించలేదని పేర్కొన్నారు.

మరోవైపు ఫతేపూర్‌లోని గంగానదిలో ఆరు మృతదేహాలను గుర్తించినట్లు అధికారులు తెలిపారు. స్థానికుల సమాచారం మేరకు నది వద్దకు చేరుకొని ఆ శవాలను బయటకు తీశారు. ఆదివారం ఉత్తర్‌ప్రదేశ్‌లోని బలరాంపుర్‌ జిల్లాలో రాప్తీ నది వంతెన మీదుగా కరోనా వైరస్‌ బాధితుడి మృతదేహాన్ని నదిలోకి విసరడం దుమారం రేపింది. ఇద్దరు వ్యక్తులు నదిలోకి మృతదేహాన్ని విసురుతున్న వీడియో వైరల్‌ కావడంతో పోలీసులు రంగంలోకి దిగి, ఆ ఇద్దరినీ అరెస్టు చేశారు.


Read latest Crime News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts