Crime news: విజయవాడలో కారులో మృతదేహం... 3 రోజులుగా అక్కడే

బెజవాడ పడమటలంకలో పార్కింగ్‌ చేసిన కారులో మృతదేహం కలకలం రేపింది. డీమార్టు వద్ద రోడ్డు పక్కన నిలిపి ఉంచిన ఏపీ 37బీఏ 5456 నంబరు ఇండికా కారు నుంచి

Published : 04 May 2022 02:29 IST

విజయవాడ: బెజవాడ పడమటలంకలో పార్కింగ్‌ చేసిన కారులో మృతదేహం కలకలం రేపింది. డీమార్టు వద్ద రోడ్డు పక్కన నిలిపి ఉంచిన ఏపీ 37బీఏ 5456 నంబరు ఇండికా కారు నుంచి దుర్వాసన వస్తోందని స్థానికులు ఫిర్యాదు చేయడంతో పోలీసులు రంగంలోకి దిగారు. ఘటనాస్థలికి చేరుకుని కారును పరిశీలించగా అందులో మృతదేహం ఉన్నట్టు గుర్తించారు. గత 3 రోజులుగా ఇండికా కారు అక్కడే ఉందని స్థానికులు తెలిపారు. కారు నంబర్‌ ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మృతుని వివరాలు తెలియాల్సి ఉంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని