Crime news: చిన్నారిపై హత్యాచారం.. వలస కార్మికుడికి మరణశిక్ష!

రెండున్నరేళ్ల బాలికపై అత్యాచారం చేసి హత్య చేసిన 35 ఏళ్ల వలస కార్మికుడికి గుజరాత్‌లోని సూరత్‌లో పోక్సో కోర్టు మరణశిక్ష విధించింది.

Published : 08 Dec 2021 01:44 IST

సూరత్‌: రెండున్నరేళ్ల బాలికపై అత్యాచారం చేసి హత్య చేసిన 35 ఏళ్ల వలస కార్మికుడికి గుజరాత్‌లోని సూరత్‌లో పోక్సో కోర్టు మరణశిక్ష విధించింది. సూరత్‌లోని పందేసర ప్రాంతానికి చెందిన రెండున్నరేళ్ల చిన్నారిపై అదే ప్రాంతంలో నివాసం ఉంటున్న బిహార్‌కు చెందిన గుడ్డు యాదవ్ అనే కామాంధుడు అఘాయిత్యానికి పాల్పడ్డాడు. నవంబర్ 4 రాత్రి అతడు ఈ నేరానికి పాల్పడగా.. కేవలం నెల రోజుల వ్యవధిలోనే నిందితుడికి శిక్ష విధించడం గమనార్హం. బాలికపై హత్యాచారానికి పాల్పడిన గుడ్డు యాదవ్‌ను అదే నెల 8న పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసులో 7 రోజుల్లోనే 246 పేజీల చార్జ్‌షీట్‌ను పోలీసులు కోర్టులో సమర్పించారు. ఈ కేసులో 43 మంది సాక్షులను విచారించిన న్యాయస్థానం.. కేవలం 28 రోజుల్లోనే తీర్పును వెలువరించింది. సోమవారం నిందితుడు గుడ్డు యాదవ్‌ను దోషిగా తేల్చిన కోర్టు.. మంగళవారం మరణశిక్ష ఖరారు చేసింది. బాధితురాలి కుటుంబ సభ్యులకు రూ.20 లక్షల పరిహారం ఇవ్వాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.

Read latest Crime News and Telugu News


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని