Liquor: 55కు చేరిన కల్తీ మద్యం మృతుల సంఖ్య

ఉత్తరప్రదేశ్‌లోని అలీగఢ్ జిల్లాలో కల్తీ మద్యం తాగిన ఘటనలో మృతుల సంఖ్య రోజురోజుకి పెరుగుతోంది. ఆదివారం నాటికి 55 మంది మృదిచెందినట్లు తెలుస్తోంది....

Updated : 21 Dec 2022 15:57 IST

అలీగఢ్: ఉత్తరప్రదేశ్‌లోని అలీగఢ్ జిల్లాలో కల్తీ మద్యం తాగిన ఘటనలో మృతుల సంఖ్య రోజురోజుకి పెరుగుతోంది. ఆదివారం నాటికి 55 మంది మృతిచెందినట్లు తెలుస్తోంది. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిలో మరో 17 మంది పరిస్థితి విషమంగా ఉంది. వారంతా  జేఎన్‌ వైద్య కళాశాలతో పాటు, అలీగఢ్ జిల్లా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

అయితే మృతుల సంఖ్యను ప్రభుత్వం అధికారికంగా ప్రకటించలేదు. ఈ ఘటనలో 25 మందే మృతిచెందారని జిల్లా మెజిస్ట్రేట్‌ చంద్రభూషణ్‌ సింగ్‌ శనివారం నిర్ధరించారు. అయితే అలీగఢ్‌ ఎంపీ చెప్పిన మృతుల సంఖ్యకు, కలెక్టర్‌ వెల్లడించిన లెక్కలకు పొంతన లేకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. తాము ఇప్పటివరకు 51 మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహించామని జిల్లా ప్రధాన వైద్యాధికారి ఆదివారం వెల్లడించారు. ఇందులో 25 మంది కల్తీ మద్యం కారణంగానే మరణించినట్లు తేలిందని పేర్కొన్నారు. మరో 26 మృతదేహాల నుంచి నమూనాలు సేకరించామని.. వాటిని పరీక్షల కోసం ఆగ్రాకు పంపించినట్లు తెలిపారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని