High Court: బాలికలపై లైంగిక వేధింపుల కేసు..నిందితుడి అప్పీలును తిరస్కరించిన దిల్లీ హైకోర్టు

బాలికలను లైంగికంగా వేధించిన కేసులో నిందితుడి అప్పీలును తోసిపుచ్చుతూ గతంలో కింది కోర్టు ఇచ్చిన తీర్పును దిల్లీ హైకోర్టు (Delhi High Court) సమర్థించింది. 

Published : 30 Mar 2023 20:19 IST

దిల్లీ: బాలికలను లైంగికంగా వేధించిన కేసులో నిందితుడి అప్పీలును తోసిపుచ్చుతూ గతంలో కింది కోర్టు ఇచ్చిన తీర్పును దిల్లీ హైకోర్టు (Delhi High Court) సమర్థించింది. ఈ మేరకు బుధవారం తన తీర్పును వెలువరిచింది. వివరాల్లోకి వెళితే..

పాఠశాల బస్సు డ్రైవర్‌గా పని చేసిన ఓ వ్యక్తి ఐదో తరగతి చదువుతున్న ఇద్దరు బాలికలపై(10) కర్కశంగా ప్రవర్తించాడు. చిన్నారులను లైంగిక వేధింపులకు గురి చేశాడు. విషయాన్ని బాలికలు తల్లిదండ్రులకు చెప్పడంతో వారు నిందితుడిపై ఫిర్యాదు చేశారు.  దీంతో 2014లో అతడిపై రెండు ఎఫ్‌ఐఆర్‌లు వేర్వేరుగా నమోదయ్యాయి. ఐపీసీ 354ఏ(లైంగిక వేధింపులు), సెక్షన్‌ 10 (తీవ్రమైన లైంగిక వేధింపులకు శిక్ష), ఫోక్సో చట్టం కింద పోలీసులు కేసు నమోదుచేశారు. ఈ కేసులో నిందితుడికి ఐదేళ్ల జైలు శిక్ష విధిస్తూ ట్రయల్‌ కోర్టు 2020లో తీర్పునిచ్చింది. ట్రయల్‌ కోర్టు తీర్పును సవాల్‌ చేస్తూ నిందితుడు హైకోర్టులో అప్పీలు వేశాడు. న్యాయమూర్తి జస్టిస్‌ జస్మీత్‌ సింగ్‌ నేతృత్వంలో విచారణ జరిపిన హైకోర్టు నిందితుడి అప్పీలును తోసిపుచ్చింది. నేరాన్ని తీవ్రమైనదిగా పరిగణిస్తూ నిందితుడికి శిక్ష ఖరారు చేసింది. ఈ కేసులో బాధితుల సాక్ష్యాలు బలంగా ఉన్నాయని పేర్కొంది. సంఘటనను బాధితులిద్దరూ ఒకేలా వివరించారని తెలిపింది. ఏఎస్‌జే-1(నార్త్‌ ఈస్ట్‌), కర్కర్‌దూమా కోర్టులు ఇచ్చిన తీర్పులో ఎలాంటి తప్పు లేదని స్పష్టం చేసింది.

 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని