Delhi: దిల్లీలో ఘోరం..విద్యార్థినిని మొదటి అంతస్తు నుంచి విసిరేసిన టీచర్
దిల్లీలో ఐదో తరగతి చదువుతున్న విద్యార్థినిని టీచర్ కిటికీలోంచి బయటకి విసిరేసింది. తీవ్ర గాయాలపాలైన ఆమె ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది.
దిల్లీ: దేశ రాజధాని దిల్లీ (Delhi)లో ఘోరం జరిగింది. చదువు చెప్పాల్సిన టీచరే.. ఓ విద్యార్థినిని మొదటి అంతస్తు కిటికీ నుంచి కిందికి విసిరేసింది. తీవ్రగాయాలపాలైన ఆమెను స్థానికులు సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం విద్యార్థిని ఆరోగ్యం ఆందోళనకరంగా ఉన్నట్లు సమాచారం. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సెంట్రల్ దిల్లీ (Central Delhi) పాఠశాలలో బాధిత విద్యార్థిని ఐదో తరగతి చదువుతోంది. ఏమైందో తెలియదుగానీ, కిటికీ లోంచి ఆమెను విసిరేయడానికి ముందు విద్యార్థినిపై టీచర్ కత్తెర్లతో దాడి చేసింది. గమనించిన సహచర ఉపాధ్యాయిని ఒకరు ఆమెను వారించే ప్రయత్నం చేసింది. అయినా వినకుండా కోపంతో విద్యార్థినిని కిటికీలోంచి బయటకు విసిరేసింది. దీంతో పెద్ద ఎత్తున జనం గుమిగూడి పోలీసులకు సమాచారం అందించారు. పాఠశాలకు వచ్చిన పోలీసులు నిందితురాలిని కస్టడీలోకి తీసుకొని హత్యాయత్నం కేసు నమోదు చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Japan : మరోసారి పసిఫిక్ మహా సముద్రంలోకి అణుజలాలు విడుదల.. ప్రకటించిన జపాన్
-
Prithviraj Sukumaran: రోజుకు 9 గంటలు ఫిజియోథెరపీ.. హెల్త్ అప్డేట్పై హీరో పోస్ట్
-
PCB Chief: పాకిస్థాన్ క్రికెట్ చీఫ్ వ్యాఖ్యలపై నెట్టింట తీవ్ర విమర్శలు!
-
Hacking: అమెరికా కీలక ఈ మెయిల్స్‌ను తస్కరించిన చైనా హ్యాకర్లు !
-
Chandrababu Arrest: సెప్టెంబర్ 30న ‘మోత మోగిద్దాం!’.. వినూత్న నిరసనకు తెదేపా పిలుపు
-
Stock Market: లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్ సూచీలు.. 19,600 పైకి నిఫ్టీ