Telangana News: బాలిక మృతదేహంతో రహదారిపై ధర్నా.. జడ్చర్లలో ఉద్రిక్తత
బాలిక మృతిపై అనుమానాలు వ్యక్తం చేస్తూ.. జడ్చర్ల పట్టణంలోని నేతాజీ చౌక్‌లో మృతదేహంతో కుటుంబసభ్యులు ఆందోళనకు దిగారు. ప్రజా సంఘాలు, రాజకీయ నాయకులు, బాలిక కుటుంబసభ్యులు రోడ్డుపై మృతదేహాన్ని ఉంచి నిరసన తెలిపారు.
జడ్చర్ల గ్రామీణం: బాలిక మృతిపై అనుమానాలు వ్యక్తం చేస్తూ.. జడ్చర్ల పట్టణంలోని నేతాజీ చౌక్‌లో మృతదేహంతో కుటుంబసభ్యులు ఆందోళనకు దిగారు. ప్రజా సంఘాలు, రాజకీయ నాయకులు, బాలిక కుటుంబసభ్యులు రోడ్డుపై మృతదేహాన్ని ఉంచి సాయంత్రం 4 గంటల నుంచి 7గంటల వరకు నిరసన తెలిపారు.
వివరాల్లోకి వెళ్తే.. బాలానగర్ మండలం తిరుమలగిరి గ్రామ పంచాయితీలోని ఓ తండాకు చెందిన హనుమంతు, శారదా దంపతుల కుమార్తె(15) శనివారం ఉదయం ఇంట్లో ఫ్యాన్‌కు ఉరి వేసుకొని మృతి చెందింది. అదే గ్రామానికి చెందిన శ్రీనివాస్ నాయక్, శ్రీనివాసులు, పక్క గ్రామానికి చెందిన శివ అనే ముగ్గురు వ్యక్తులు బాలికపై హత్యాచారం చేసి ఉరి వేశారని ఆమె కుటుంబసభ్యులు ఆరోపిస్తూ.. రోడ్డుపై బైఠాయించారు. దీంతో నిత్యం రద్దీగా ఉండే రహదారిపై రాకపోకలు స్తంభించాయి. వాహనాదారులు స్థానికులు తీవ్ర అవస్థలు పడ్డారు.
జిల్లా ఎస్పీ వెంకటేశ్వర్లు, ఆర్డీవో అనిల్ కుమార్ ఘటనాస్థలికి చేరుకుని బాధితులకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. దీంతో బాలిక కుటుంబ సభ్యులు ఆందోళన విరమించారు. అధికారులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం బాదేపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోస్టుమార్టం నివేదిక అనంతరం నిందితులపై చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
India News
అలా చేస్తే.. 2030 కల్లా భారత్ దివాలా తీయడం ఖాయం: హరియాణా సీఎం కీలక వ్యాఖ్యలు
-
World News
Chinese spy balloon: అమెరికా అణ్వాయుధ స్థావరంపై చైనా నిఘా బెలూన్..!
-
Politics News
Kotamreddy: అధికార పార్టీ ఎమ్మెల్యే ఫోన్ ట్యాపింగ్.. ఆషామాషీగా జరగదు: కోటంరెడ్డి
-
India News
Air India Express: గగనతలంలో ఇంజిన్‌లో మంటలు.. విమానానికి తప్పిన ముప్పు
-
Movies News
K Vishwanath: కె.విశ్వనాథ్ ఖాకీ దుస్తుల వెనుక కథ ఇది!
-
Movies News
K Viswanath: విశ్వనాథ వారి కలం.. అవార్డులు వరించిన ఈ ఐదు చిత్రాలు ఎంతో ప్రత్యేకం..!