Robbery: యజమాని ఇంట్లో రూ.8 కోట్లు చోరీ చేసిన పనిమనిషి

యజమాని ఇంటి నుంచి రూ.8 కోట్ల విలువైన నగదు, నగలను దొంగిలించిన పనిమనిషి, అతడి బంధువును పోలీసులు అరెస్టు చేశారు. దిల్లీలోని పంజాబీ బాఘ్‌ ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. యజమాని

Updated : 29 Jul 2022 11:47 IST

దిల్లీ: యజమాని ఇంటి నుంచి రూ.8 కోట్ల విలువైన నగదు, నగలను దొంగిలించిన పనిమనిషి, అతడి బంధువును పోలీసులు అరెస్టు చేశారు. దిల్లీలోని పంజాబీ బాఘ్‌ ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. యజమాని ఫిర్యాదు ప్రకారం.. అతడి ఇంట్లో బిహార్‌కు చెందిన మోహన్‌ కుమార్‌ గత ఐదేళ్లుగా పనిచేస్తున్నాడు. ఈ నెల 4వ తేదీన ఇంటి యజమాని తన కుటుంబంతో కలిసి అమెరికా వెళ్తూ ఇంటి తాళాలు కుమార్‌కు ఇచ్చాడు.

అయితే, ఈ నెల 18న కుమార్‌ ఆ ఇంట్లో దొంగతనానికి పాల్పడినట్లు మరో సహాయకుడు యజమానికి సమాచారమిచ్చాడు. కారు, డబ్బు, నగలతో అతడు పరారైనట్లు తెలిపాడు. దీంతో ఇంటి యజమాని పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీటీవీ దృశ్యాలను పరిశీలించారు. అందులో కుమార్‌, మరో వ్యక్తితో కలిసి సూట్‌కేసు తీసుకుని యజమాని కారులో వెళ్తున్నట్లు కన్పించింది.

కుమార్‌ ఆ కారును రమేశ్‌ నగర్‌ మెట్రో స్టేషన్‌ దగ్గర వదిలి వెళ్లినట్లు పోలీసులు గుర్తించారు. పోలీసులు బిహార్‌కు వెళ్లి నిందితులను అరెస్టు చేశారు. నిందితుల నుంచి రూ.5లక్షల నగదు, బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. మిగతా సొత్తును రికవరీ చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని