
Updated : 06 Jun 2021 18:47 IST
శంషాబాద్‌లో భారీగా హెరాయిన్ పట్టివేత
హైదరాబాద్: శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ఆదివారం డీఆర్‌ఐ అధికారులు భారీగా హెరాయిన్ స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరు మహిళా ప్రయాణికుల నుంచి 12 కిలోల హెరాయిన్ స్వాధీనం చేసుకున్నట్టు అధికారులు వెల్లడించారు. స్వాధీనం చేసుకున్న హెరాయిన్ విలువ రూ.78 కోట్లు ఉంటుందని అంచనా వేశారు.
ఉగాండా, జాంబియా నుంచి వచ్చిన ఇద్దరు మహిళా ప్రయాణికుల లగేజీ తనిఖి చేయగా బ్యాగ్, పైప్ రోల్ దాచిన 12 కిలోల హెరాయిన్ బయటపడిందని డీఆర్‌ఐ అధికారులు తెలిపారు. ఇద్దరినీ అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్టు చెప్పారు.
ఇవీ చదవండి
Tags :