Gold smuggling: ఆయిల్ ట్యాంకర్లలో స్మగ్లింగ్‌.. 15.93 కిలోల బంగారం స్వాధీనం

భారత్‌-మయన్మార్‌ సరిహద్దులో భారీగా బంగారం పట్టుబడింది. అక్రమంగా రవాణా చేస్తున్న 15.93 కిలోల విదేశీ బంగారాన్ని .....

Updated : 13 May 2022 19:53 IST

దిల్లీ: భారత్‌-మయన్మార్‌ సరిహద్దులో భారీగా బంగారం పట్టుబడింది. అక్రమంగా రవాణా చేస్తున్న 15.93 కిలోల విదేశీ బంగారాన్ని రెవెన్యూ ఇంటెలిజెన్స్‌ అధికారులు స్వాధీనం చేసుకున్నట్టు ఆర్థిక మంత్రిత్వశాఖ వెల్లడించింది. ఈ విదేశీ బంగారం విలువ రూ.8కోట్లకు పైనే ఉంటుందని అధికారులు తెలిపారు. ‘గోల్డ్ ఆన్ ది హైవే’ అనే పేరుతో చేపట్టిన ఆపరేషన్‌లో భాగంగా డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (DRI) అధికారులు మణిపూర్‌లోని మావూ నుంచి అస్సాంలోని గువహటి వరకు వేర్వేరుగా ప్రయాణం చేస్తున్న రెండు ఆయిల్‌ ట్యాంకర్లు, ఒక ట్రక్కుపై నిఘా వేసి పట్టుకున్నారు. మే 12న తెల్లవారు జామున ఈ వాహనాలు దిమాపూర్‌- గువహటి మధ్య జాతీయ రహదారిపై వివిధ పాయింట్ల వద్ద వాహనాలను అడ్డుకొని తనిఖీ చేశారు. దీంతో ఆయా వాహనాల్లో వివిధ భాగాల్లో దాచి ఉంచిన మొత్తం 96 గోల్డ్‌ బిస్కెట్లు (దాదాపు 8.38 కిలోలు) స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ సుమారు రూ.8.38 కోట్లు ఉంటుందని అంచనా. అక్రమంగా విదేశీ బంగారం తరలింపు వ్యవహారంలో ఐదుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్న అధికారులు.. మూడు వాహనాలను సీజ్‌ చేసి తదుపరి దర్యాప్తు కొనసాగిస్తున్నారని ఆర్థిక మంత్రిత్వశాఖ ఓ ప్రకటనలో తెలిపింది. 

మరోవైపు, గత ఆర్థిక సంవత్సరంలో దేశ వ్యాప్తంగా డీఆర్‌ఐ అధికారులు రూ.405 కోట్లు విలువ చేసే 833 కిలోల బంగారాన్ని సీజ్‌ చేశారు. ఇందులో, ఈశాన్య రాష్ట్రాల్లో.. అత్యంత సున్నితమైన భారత్‌-మయన్మార్, భారత్‌- బంగ్లాదేశ్ సరిహద్దుల ద్వారా అక్రమంగా తరలిస్తున్న రూ.102.6 కోట్లు విలువ చేసే 208 కిలోల బంగారాన్ని సీజ్‌ చేయడం గమనార్హం.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని