Crime news: బెంగళూరు నుంచి తెచ్చి.. హైదరాబాద్‌లో డ్రగ్స్‌ విక్రయిస్తున్న ముఠా అరెస్టు

బెంగళూరు నుంచి డ్రగ్స్‌ తెచ్చి హైదరాబాద్‌లో విక్రయిస్తున్న ముఠాను బహుదూర్‌పురా పోలీసులతో కలిసి టీజీన్యాబ్‌ పోలీసులు అరెస్టు చేశారు.

Published : 12 Jun 2024 21:30 IST

హైదరాబాద్‌: బెంగళూరు నుంచి డ్రగ్స్‌ తెచ్చి హైదరాబాద్‌లో విక్రయిస్తున్న ముఠాను బహుదూర్‌పురా పోలీసులతో కలిసి టీజీన్యాబ్‌ పోలీసులు అరెస్టు చేశారు. 34 గ్రాముల ఎంఎండీఏ డ్రగ్‌ను బహుదూర్‌పురాలో విక్రయించేందుకు వచ్చిన వారిని పోలీసులు పట్టుకున్నారు. సయ్యద్‌ ఫైజల్‌, మస్రత్‌ ఉన్నీసాబేగం, జునైద్‌ఖాన్‌, అబ్రరుద్దీన్‌, రహ్మత్‌ ఖాన్‌లను అరెస్టు చేశారు. జునైద్‌ ఖాన్‌ బెంగళూరుకు చెందిన వ్యక్తి కాగా, మిగిలిన నిందితులు హైదరాబాద్‌ వాసులని పోలీసులు తెలిపారు. వారి నుంచి 34 గ్రాముల ఎంఎండీఏ డ్రగ్‌తో పాటు 6 సెల్‌ఫోన్‌లు స్వాధీనం చేసుకున్నారు. ఎవరైనా డ్రగ్స్‌ వినియోగిస్తున్నట్టు, విక్రయిస్తున్నట్టు తెలిస్తే  8712971111 నెంబర్‌కు సమాచారం ఇవ్వాలని పోలీసులు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని