Andhra News: చెన్నైలో తీగ లాగితే.. ఒంగోలులో డ్రగ్స్‌ డొంక కదిలింది

అది ఒక పారిశ్రామిక గోడౌన్‌ కానీ, అందులో గుట్టుగా డ్రగ్స్‌ ముడిసరుకు చెన్నై నుంచి తీసుకొచ్చి ప్యాకింగ్‌ చేసి ఇతర రాష్ట్రాలకు సరఫరా చేస్తున్నట్టు తెలిసింది. దీంతో చెన్నైలో తీగలాగితే...

Updated : 08 Mar 2022 19:59 IST

ఒంగోలు: అది ఒక పారిశ్రామిక గోడౌన్‌ కానీ, అందులో గుట్టుగా డ్రగ్స్‌ ముడిసరుకు చెన్నై నుంచి తీసుకొచ్చి ప్యాకింగ్‌ చేసి ఇతర రాష్ట్రాలకు సరఫరా చేస్తున్నట్టు తెలిసింది. దీంతో చెన్నైలో తీగలాగితే... ఒంగోలులో డ్రగ్స్‌ డొంక కదిలింది. ఒంగోలులోని ఇండస్ట్రియల్‌ ఎస్టేట్‌లో నిషేధిత మత్తు పదార్థాల తయారీ స్థావరంపై చెన్నై పోలీసులు దాడి చేసి ఈ కేంద్రాన్ని సీజ్‌ చేశారు. దీంతో అక్కడ నిషేధిత పదార్థం మెథాంఫెటమైన్‌ అనే డ్రగ్‌ని గుట్టుగా తయారు చేసి ప్యాకెట్ల రూపంలో ఇతర రాష్ట్రాలకు సరఫరా చేస్తున్నట్టు వెలుగులోకి వచ్చింది. చెన్నై నుంచి వచ్చిన ప్రత్యేక పోలీసు బృందం నేరుగా పారిశ్రామికవాడలోని గోడౌన్‌ వద్దకు వెళ్లి తనిఖీ చేయగా.. మత్తు పదార్థాలు తయారు చేస్తున్నట్టు గుర్తించారు. ఆరు రోజుల క్రితం చెన్నైలో మెథాంఫెటమైన్‌ డ్రగ్‌ తీసుకుంటున్న నలుగురిని పోలీసులు పట్టుకున్నారు. ఇది ఎక్కడి నుంచి వచ్చింది? ఎవరు సరఫరా చేస్తున్నారు? అనే కోణంలో విచారించగా.. ఒంగోలు తయారీ కేంద్రం గుట్టు తెలిసింది. దీని మూలాలు హైదరాబాద్‌లో ఉన్నట్టు తేలింది. దీంతో అక్కడకు కూడా ప్రత్యేక బృందాలు వెళ్లినట్టు సమాచారం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని