Crime News: డ్రగ్స్‌తో బీటెక్‌ విద్యార్థి మృతి కేసు.. మరో ముగ్గురి అరెస్ట్‌

అధిక మోతాదులో డ్రగ్స్‌ తీసుకుని అనారోగ్యంతో మృతిచెందిన బీటెక్‌ విద్యార్థి కేసులో పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. దీనికి సంబంధించి మరో

Published : 06 Apr 2022 15:07 IST

హైదరాబాద్‌: అధిక మోతాదులో డ్రగ్స్‌ తీసుకుని అనారోగ్యంతో మృతిచెందిన బీటెక్‌ విద్యార్థి కేసులో పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. దీనికి సంబంధించి మరో నిందితుడిని అరెస్ట్‌ చేశారు. మంగళవారం కీలక నిందితుడు లక్ష్మీపతిని అరెస్ట్‌ చేసిన పోలీసులు.. తాజాగా ఏపీ నుంచి హాష్‌ ఆయిల్‌ను సరఫరా చేస్తున్న నగేశ్‌, మరో ఇద్దరిని అరెస్ట్‌ చేశారు. నిందితుల నుంచి 840 గ్రాముల హాష్‌ ఆయిల్‌ను స్వాధీనం చేసుకున్నారు. 

గతవారం ప్రేమ్‌ ఉపాధ్యాయతో పాటు ముగ్గురు వినియోగదారులను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. లక్ష్మీపతి కోసం గాలించగా అతడు ఏపీలో మంగళవారం పట్టుబడ్డాడు. లక్ష్మీపతి నుంచి రాబట్టిన ఆధారాలతో నగేశ్‌ను అరెస్ట్‌ చేశారు. ఈ కేసులో ఇప్పటివరకు అరెస్ట్‌ చేసిన నిందితుల సంఖ్య 7కి చేరింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని