Updated : 01 May 2022 14:06 IST

Andhra News: విజయవాడలో మరోసారి డ్రగ్స్‌ కలకలం

విజయవాడ: విజయవాడలో మరోసారి డ్రగ్స్‌ కలకలం రేగింది. సత్తెనపల్లికి చెందిన సాయిగోపి అనే వ్యక్తి పంపిన పార్శిల్‌లో డ్రగ్స్‌ ఉన్నట్లు బెంగళూరులో గుర్తించారు. ఈ పార్శిల్‌ను విజయవాడ డీటీఎస్‌ కొరియర్‌ నుంచి ఆస్ట్రేలియాకు పంపగా వివరాలు సరిగా లేక కెనడాకు వెళ్లింది. కెనడా నుంచి వెనక్కి వస్తుండగా.. బెంగళూరులో డ్రగ్స్‌ పార్శిల్‌ను కస్టమ్స్‌ అధికారులు పట్టుకున్నారు. అందులో నాలుగు కేజీల డ్రగ్స్‌ ఉన్నట్లు అధికారులు గుర్తించారు.

దీనికి సంబంధించి కొరియర్‌బాయ్‌ తేజను గత నెల 27న బెంగళూరు పిలిపించిన కస్టమ్స్‌ అధికారులు అతడిని అరెస్టు చేశారు. విచారణలో భాగంగా కొరియర్‌ కార్యాలయంలో సాయిగోపి ఇచ్చిన ఆధార్‌ కార్డ్‌ నకిలీదని తేలింది. పట్టుబడిన పార్శిల్‌లో పిరిడిన్‌ అనే నిషేధిత డ్రగ్‌ను గుర్తించారు. అనంతరం కస్టమ్స్‌ అధికారులు విజయవాడ పోలీసులకు ఈ సమాచారం అందించారు. 

స్థానిక పోలీసులు దీనిపై రెండు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. ఒక దాన్ని సత్తెనపల్లికి మరో బృందాన్ని బెంగళూరు ఎయిర్‌పోర్టు కస్టమ్స్‌ అధికారుల వద్దకు పంపారు. సాయిగోపి ఇటీవల రెండు సార్లు పచ్చళ్ల పార్శిల్స్‌ పంపినట్లు పోలీసులు గుర్తించారు. ఆ సమయంలో నిజంగా పచ్చళ్లు పంపాడా? లేదా ఇప్పటి లాగే డ్రగ్స్‌ను పంపాడా? అనే కోణంలో విచారణ జరుపుతున్నారు. ఇటీవల గుజరాత్‌లోని ఓ పోర్టులో పట్టుకున్న డ్రగ్స్‌ను పంపిన చిరునామా విజయవాడలో ఉండటం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన విషయం తెలిసిందే. 

Read latest Crime News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts