
Updated : 20 Jan 2022 12:37 IST
Crime News: డ్రగ్స్ మాఫియా ప్రధాన నిందితుడు టోనీ అరెస్టు
హైదరాబాద్: డ్రగ్స్ మాఫియా ప్రధాన నిందితుడు టోనీ ఎట్టకేలకు అరెస్టయ్యాడు. నైజీరియాకు చెందిన టోనీని టాస్క్‌ఫోర్స్ పోలీసులు ముంబయిలో అరెస్టు చేశారు. మంబయి కేంద్రంగా మాదకద్రవ్యాల నెట్వర్క్ నిర్వహిస్తున్న టోనీ.. అక్కడి నుంచి దేశవ్యాప్తంగా డ్రగ్స్‌ను సరఫరా చేస్తున్నాడు. ముంబయిలో టోనీని అదుపులోకి తీసుకున్న పోలీసులు హైదరాబాద్‌కు తీసుకొచ్చారు. డ్రగ్స్ సరఫరాకు ఇతను హైదరాబాద్, బెంగళూరు, చెన్నై సహా అన్ని ప్రధాన నగరాల్లో ప్రత్యేకంగా ఏజెంట్లను ఏర్పాటు చేసుకున్నాడు. హైదరాబాద్‌లో పలువురు ప్రముఖులకు టోనీ గ్యాంగ్ డ్రగ్స్ సరఫరా చేసింది. ముంబయిలో టోనీతో పాటు తొమ్మిది మంది డ్రగ్స్ వినియోగదారులను కూడా పోలీసులు అరెస్టు చేశారు.
Advertisement
Tags :