DSP To Constable: మహిళా పోలీసుతో అక్రమ సంబంధం.. డీఎస్పీ నుంచి కానిస్టేబుల్‌గా డిమోషన్‌

DSP To Constable: ఓ మహిళతో అక్రమ సంబంధం పెట్టుకున్న డీఎస్పీని కానిస్టేబుల్‌గా డిమోట్‌ చేస్తూ యూపీ పోలీసు విభాగం నిర్ణయం తీసుకుంది.

Updated : 23 Jun 2024 11:20 IST

DSP To Constable | లఖ్‌నవూ: ఓ మహిళతో అక్రమ సంబంధం పెట్టుకున్న డీఎస్పీకి యూపీ పోలీసు విభాగం తగిన బుద్ధి చెప్పింది. నేరానికి పాల్పడిన అతడిని కానిస్టేబుల్‌ స్థాయికి డిమోట్‌ (DSP Demoted To Constable) చేస్తూ అక్కడి పోలీసు శాఖ నిర్ణయం తీసుకుంది. వివరాల్లోకి వెళితే..

క్రిపా శంకర్‌ కనౌజియా కానిస్టేబుల్‌ స్థాయి నుంచి అంచెలంచెలుగా ఎదుగుతూ డీఎస్పీ స్థాయికి చేరుకున్నాడు. కానీ, మూడేళ్ల క్రితం ఓ మహిళతో వివాహేతర సంబంధం విషయంలో రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు. ఈ ఘటన జరిగిన సమయంలో ఆయన ఉన్నావ్‌లో సర్కిల్‌ ఆఫీసర్‌గా పనిచేస్తున్నాడు. కుటుంబ కారణాలు చెప్పి ఎస్పీ అనుమతితో సెలవు తీసుకున్నాడు. ఇంటికి వెళ్లడానికి బదులు ఓ మహిళా కానిస్టేబుల్‌తో కలిసి కాన్పుర్‌లోని హోటల్‌కు వెళ్లాడు. అధికారిక, వ్యక్తిగత ఫోన్లను స్విచ్ఛాఫ్‌ చేశాడు.

కనౌజియా ఫోన్‌ కలవకపోవటంతో అతడి భార్య ఉన్నావ్‌ ఎస్పీని సంప్రదించారు. దీనిపై వెంటనే దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు కాన్పుర్‌లోని హోటల్‌లో చివరిసారి అతడి ఫోన్‌ లొకేషన్‌ను గుర్తించారు. వెంటనే అక్కడికి చేరుకుని ఇద్దరినీ పట్టుకున్నారు. దీన్ని చాలా తీవ్రంగా పరిగణించిన అప్పటి లఖ్‌నవూ రేంజ్‌ ఐజీపీ విచారణకు ఆదేశించారు. క్రమశిక్షణారాహిత్యం కింద కఠిన చర్యలు తీసుకోవాలని సిఫార్సు చేశారు. దీనిపై ఇటీవల విచారణ పూర్తి చేసిన పోలీసులు.. అతణ్ని గోరఖ్‌పూర్‌ బెటాలియన్‌లోని ‘ప్రావిన్షియల్‌ ఆర్మ్‌డ్‌ కానిస్టేబులరీ’లో కానిస్టేబుల్‌గా (DSP Demoted To Constable) డిమోట్‌ చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని