Karvey: ఈడీ కస్టడీలోకి కార్వీ సంస్థ ఛైర్మన్‌ పార్థసారథి

కార్వీ సంస్థ ఛైర్మన్‌ పార్థసారథిని ఈడీ అధికారులు కస్టడీలోకి తీసుకున్నారు. ఇటీవలే ఆయనను బెంగళూరులో అరెస్టు చేసి

Published : 27 Jan 2022 12:22 IST

హైదరాబాద్: కార్వీ సంస్థ ఛైర్మన్‌ పార్థసారథిని ఈడీ అధికారులు కస్టడీలోకి తీసుకున్నారు. ఇటీవలే ఆయనను బెంగళూరులో అరెస్టు చేసి చంచల్‌గూడ జైలుకు తరలించిన విషయం తెలిసిందే. ఇవాళ జైలు నుంచి కస్టడీలోకి తీసుకున్న అధికారులు వైద్య పరీక్షల అనంతరం ఈడీ కార్యాలయానికి తరలించారు. నాలుగు రోజుల పాటు పార్థసారథిని ఈడీ ప్రశ్నించనుంది.

మనీలాండరింగ్‌తో పాటు సంస్థలో పెట్టుబడిదారుల షేర్లను బ్యాంక్లలో తనఖా పెట్టి రుణాలు తీసుకున్నట్లు పార్థసారథిపై పలు కేసులు నమోదయ్యాయి. ఆ రుణాలను డొల్ల కంపెనీలకు మళ్లించి ఆస్తులు కొనుగోలు చేసినట్లు ఈడీ గుర్తించింది. ముఖ్యంగా మనీ లాండరింగ్‌కు సంబంధించి కస్టడీలో అతడిని ప్రశ్నించనుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని