మావోయిస్టు మెడికల్‌ టీం సభ్యురాలి లొంగుబాటు

ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రం సుక్మా జిల్లా పోలంపల్లి గ్రామానికి చెందిన పొడియం సోమిడి అనే మహిళా మావోయిస్టు సోమవారం ఆ జిల్లా ఎస్పీ సునీల్‌శర్మ, సీఆర్పీఎఫ్‌ కమాండెంట్‌ యెజ్ఞాన్‌ సింహా సమక్షంలో లొంగిపోయారు.

Published : 14 Jun 2022 05:59 IST

ఆమెపై రూ.2 లక్షల రివార్డు

దుమ్ముగూడెం, న్యూస్‌టుడే: ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రం సుక్మా జిల్లా పోలంపల్లి గ్రామానికి చెందిన పొడియం సోమిడి అనే మహిళా మావోయిస్టు సోమవారం ఆ జిల్లా ఎస్పీ సునీల్‌శర్మ, సీఆర్పీఎఫ్‌ కమాండెంట్‌ యెజ్ఞాన్‌ సింహా సమక్షంలో లొంగిపోయారు. పన్నెండేళ్లుగా మావోయిస్టు ఉద్యమంలో పనిచేసిన సోమిడి.. మావోయిస్టు మిలటరీ ప్లటూన్‌ కిష్టారం ఏరియా కమిటీ మెడికల్‌ టీం సభ్యురాలిగా వ్యవహరించారు. వివిధ ఎదురుకాల్పుల్లో సుమారు 60 మంది జవాన్లు మృతి చెందిన సంఘటనల్లో సోమిడి ప్రత్యక్షంగా పాల్గొన్నట్లు పోలీసు అధికారులు తెలిపారు. ఈమెపై ఛత్తీస్‌గఢ్‌ ప్రభుత్వం రూ.2 లక్షల రివార్డును ప్రకటించింది. స్వచ్ఛందంగా లొంగిపోయిన మహిళా మావోయిస్టుకు రూ.10వేల తక్షణ ఆర్థిక సాయం అందజేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని