రూ.12కోట్ల విలువైన అంబర్‌గ్రిస్‌ స్వాధీనం

తిమింగలం లాలాజలం విక్రయించే ముఠాను చెన్నై వన్యప్రాణుల నేర నియంత్రణ విభాగం అధికారులు పట్టుకున్నారు. వివరాల్లోకి వెళితే..

Published : 05 Jul 2021 01:06 IST

నరసరావుపేట: తిమింగలం లాలాజలం విక్రయించే ముఠాను చెన్నై వన్యప్రాణుల నేర నియంత్రణ విభాగం అధికారులు పట్టుకున్నారు. వివరాల్లోకి వెళితే.. నరసరావుపేటకు చెందిన 8మంది సభ్యుల ముఠా తిమింగలం లాలాజలం (అంబర్‌ గ్రిస్‌) విక్రయిస్తామని ఆన్‌లైన్‌లో బేరం పెట్టారు. ఇది గమనించిన చెన్నై వన్యప్రాణుల నేర నియంత్రణ విభాగం అధికారులు ఈ ముఠాపై నిఘాపెట్టారు. అంబర్‌ గ్రిస్‌ కొంటామని నమ్మించి... గుంటూరు జిల్లా నరసరావుపేట వచ్చిన చెన్నై అధికారులు స్థానిక టూటౌన్‌ పోలీసుల సాయంతో పువ్వాడ ఆసుపత్రి వద్ద నిందితులను పట్టుకున్నారు. నిందితుల నుంచి 8 కిలోల అంబర్‌ గ్రిస్‌ స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ బహిరంగ మార్కెట్‌లో సుమారు రూ.12కోట్ల వరకు ఉంటుందని సమాచారం. నిందితులను నరసరావుపేట కోర్టులో హాజరు పర్చగా.. న్యాయమూర్తి రెండు వారాల రిమాండ్‌ విధించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని