Updated : 06 Aug 2022 12:10 IST

పాలేరు వాగులో చిక్కుకున్న యువకుడు.. తాడు సాయంతో బయటకు లాగిన స్థానికులు

దంతాలపల్లి: మహబూబాబాద్‌ జిల్లాలోని పాలేరు వాగులో యువకుడు చిక్కుకుపోయాడు. జిల్లాలోని దంతాలపల్లి మండలం రామవరం శివారులోని వాగులో చేపల వేటకు వెళ్లి ఇద్దరు నీటి ప్రవాహంలో చిక్కుకుపోయారు. వారిలో గుగులోత్‌ సురేష్‌ సురక్షితంగా బయటపడగా.. మరో యువకుడు యాకేష్‌ (18) వాగులో చిక్కుకుపోయాడు. గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు పాలేరు వాగు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. గమనించిన స్థానికులు వెంటనే కుటుంబసభ్యులకు, పోలీసులకు సమాచారం అందించారు. యాకేష్‌ను రక్షించేందుకు గ్రామస్థుల సాయంతో పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. చివరకు తాడు సాయంతో యాకేశ్‌ను బయటకు లాగారు.


Read latest Crime News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts