
Palnadu: షార్ట్ సర్క్యూట్ తో ఇల్లు దగ్ధమై బాలుడు సజీవ దహనం
నరసరావుపేట: పల్నాడు జిల్లా నరసరావుపేట మండలం రావిపాడులో విద్యుత్ షార్ట్ సర్క్యూట్‌తో ఇల్లు దగ్ధమైంది. ఈ ఘటనలో బాలుడు సజీవ దహనమయ్యాడు. బుధవారం అర్ధరాత్రి గ్రామంలోని ఎస్సీ కాలనీలో విద్యుత్ వైర్లు తెగి అనపర్తి కోటేశ్వరరావు ఇంటిపై పడింది. ఈ ప్రమాదంలో ఇల్లు పూర్తిగా దగ్ధమైంది. ఈ ఘటనలో కిరణ్(2) సజీవదహనమయ్యాడు. అగ్నిమాపక సిబ్బంది మంటలార్పిన తర్వాత ఇంట్లో బాలుడి మృతదేహాన్ని గుర్తించారు. బాధిత కుటుంబసభ్యులను నరసరావుపేట తెలుగుదేశం బాధ్యుడు చదలవాడ అరవిందబాబు, నరసరావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి పరామర్శించారు. వారికి శ్రీనివాసరెడ్డి రూ.50వేలు అందించారు. విద్యుత్ అధికారుల నిర్లక్ష్యంతోనే ఈ ప్రమాదం జరిగిందని చదలవాడ అన్నారు. బాధిత కుటుంబానికి రూ.50 లక్షలు పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
India News
Bhagwant Mann: వైద్యురాలిని పెళ్లాడిన పంజాబ్ సీఎం.. ఇంట్లోనే నిరాడంబరంగా వివాహం
-
General News
Talasani: బోనాల నిర్వహణపై మంత్రి తలసాని సమీక్ష
-
Politics News
Payyavula Keshav: సొంత పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులపై నిఘా నిజం కాదా?: పయ్యావుల
-
Movies News
Maayon review: రివ్యూ: మాయోన్
-
General News
Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు
-
Sports News
Asia Cup : పొట్టి ప్రపంచకప్ ముందే.. భారత్Xపాక్ మరోసారి పోరు
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- Venu: అందుకే సినిమాలకు దూరంగా ఉన్నా: వేణు తొట్టెంపూడి
- IND vs ENG : ధనాధన్ వేళాయె..
- Nagababu: భీమవరం సభలో చిరంజీవి తప్ప మిగిలిన వారి నటన అద్భుతం: నాగబాబు ట్వీట్
- ప్రసవం తర్వాత.. ఆ భాగం బిగుతుగా మారాలంటే..
- ఒకటే గొప్పనుకుంటే.. ఆరు చోట్ల సాధించింది!
- Rahul Dravid : బజ్‌బాల్ అంటే ఏమిటీ?
- అలుపు లేదు... గెలుపే!
- Elon Musk: ఉద్యోగితో మరో ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చిన మస్క్?
- Chintamaneni: పటాన్చెరులో కోడి పందేలు.. పరారీలో మాజీ ఎమ్మెల్యే చింతమనేని
- Naga Chaitanya: నువ్వే నాకు ప్రేమించడం నేర్పించావ్.. చై ఎమోషనల్ పోస్ట్