ఉన్మాది తుపాకీకి 11 మంది బలి 

మెక్సికోలో తుపాకి చేతపట్టిన ఓ ఉన్మాది 11 మందిని పొట్టనబెట్టుకున్నాడు. గ్వానాజువాటో రాష్ట్రంలోని జరల్‌ డెల్‌ ప్రాగ్రెసో నగరంలో ఆదివారం ఉదయం ఓ బార్‌లో ఈ ఘటన జరిగింది. మృతుల్లో నలుగురు........

Updated : 29 Sep 2020 05:59 IST

మెక్సికో సిటీ: మెక్సికోలో తుపాకి చేతపట్టిన ఓ ఉన్మాది 11 మందిని పొట్టనబెట్టుకున్నాడు. గ్వానాజువాటో రాష్ట్రంలోని జరల్‌ డెల్‌ ప్రాగ్రెసో నగరంలో ఆదివారం ఉదయం ఓ బార్‌లో ఈ ఘటన జరిగింది. మృతుల్లో నలుగురు మహిళలు ఉన్నట్లు స్థానిక పోలీసులు తెలిపారు. వీరంతా అక్కడే డ్యాన్సర్లుగా పనిచేస్తున్నట్లు గుర్తించారు. స్థానికంగా ఉండే మాదక ద్రవ్య మాఫియా ముఠాలే ఈ ఘాతుకానికి పాల్పడ్డట్లు అనుమానిస్తున్నారు. అయితే, వారు ఏ లక్ష్యంతో దారుణానికి పాల్పడ్డారన్నది ఇంకా తెలియాల్సి ఉంది. 

ఆ దేశంలో జరిగే హింసాత్మక ఘటనల్లో గ్వానాజువాటోలోనే ఎక్కువగా జరుగుతుంటాయి. ఆగస్టులో అక్కడి కరడుగట్టిన గ్యాంగ్‌స్టర్‌ జోస్‌ ఆంటోనియో యెపెజ్‌ ఓర్టిజ్‌ అలియాస్‌ ఎల్‌ మారోను పోలీసులు అరెస్టు చేశారు. అప్పటి నుంచి నేరాలు తగ్గుతాయని భావించినప్పటికీ పెద్దగా మార్పేమీ లేదని స్థానికులు తెలిపారు. జులైలో రాష్ట్రవ్యాప్తంగా 403 మరణాలు సంభవించగా.. ఆగస్టు నాటికి అవి 339కి తగ్గాయి. కానీ, సెప్టెంబరులో అవి మళ్లీ పెరుగుతున్నట్లు పోలీసులు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని