Eluru: ప్రేమ పేరుతో ఇంజినీరింగ్ విద్యార్థినికి చిత్రహింసలు.. వేడి నూనె పోసి..
ప్రేమ పేరుతో ఓ యువకుడు ఇంజినీరింగ్ విద్యార్థినిని గదిలో బంధించి చిత్రహింసలకు గురిచేశాడు. కాళ్లు, చేతులపై వేడి నూనె పోసి తీవ్రంగా గాయపరిచాడు.
ఏలూరు నేరవార్తలు: ప్రేమ పేరుతో ఓ యువకుడు ఇంజినీరింగ్ విద్యార్థినిని గదిలో బంధించి చిత్రహింసలకు గురిచేశాడు. కాళ్లు, చేతులపై వేడి నూనె పోసి తీవ్రంగా గాయపరిచాడు. గాయపడిన ఆ యువతి ఆదివారం తెల్లవారుజామున తప్పించుకుని వచ్చి తల్లిదండ్రులకు విషయం తెలిపింది. దీంతో ఆమెను ఏలూరు ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఏలూరులోని శనివారపుపేటకు చెందిన ఓ విద్యార్థిని కాకినాడ జేఎన్టీయూలో ఇంజినీరింగ్ మూడో సంవత్సరం చదువుతోంది. శనివారపుపేటకు సమీపంలోని దుగ్గిరాలకు చెందిన సదర్ల అనుదీప్ అనే యువకుడు ఆమెను ప్రేమ పేరుతో ఉచ్చులోకి లాగాడు. పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు. సంవత్సర కాలంగా విద్యార్థినితో పరిచయం పెంచుకున్నాడు.
ఈ క్రమంలోనే ఐదు రోజుల క్రితం విద్యార్థినిని దుగ్గిరాలలోని తన ఇంటికి తీసుకుని వచ్చాడు. రోజూ రాత్రి యువతిని చిత్రహింసలకు గురి చేశాడు. ఈ విషయం ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించాడు. శనివారం అర్ధరాత్రి దాటాక విద్యార్థినిని ఉరి వేసి చంపేందుకు సన్నాహాలు చేస్తుండగా.. ఆమె తప్పించుకుంది. తల్లిదండ్రుల సాయంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాధితురాలు ప్రస్తుతం ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. ఆమె ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.
నిందితుడు అనుదీప్ పరారీలో ఉన్నాడని.. అతడి కోసం గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. గంజాయి, ఇతర మత్తు పదార్థాలకు బానిసైన అనుదీప్.. చాలా మంది అమ్మాయిలను ప్రేమ పేరుతో వంచించాడని చెప్పారు. ఏలూరు ఇన్ఛార్జ్ డీఎస్పీ పడేశ్వరరావు ఆదేశాల మేరకు మూడో పట్టణ సీఐ వరప్రసాదరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఫోన్ ట్యాపింగ్ కేసు.. పోలీసుల అదుపులో మరో ఇద్దరు
రాష్ట్రంలో కలకలం రేపుతున్న ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. -
పెళ్లి కుమార్తెను తీసుకొచ్చేందుకు వెళ్తున్న ట్రాక్టర్ బోల్తా
తెల్లవారితే తమ సమీప బంధువు ఇంట్లో జరిగే వివాహ వేడుకలో ఉత్సాహంగా పాల్గొనేవారు. ఇంతలోనే జరిగిన ప్రమాదం ఆయా కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. -
పహల్ ఫుడ్స్ కంపెనీలో భారీ అగ్నిప్రమాదం
రాజేంద్రనగర్ పరిధి కాటేదాన్‌లోని పహల్ ఫుడ్స్ కంపెనీలో గురువారం తెల్లవారుజామున భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. -
మద్యానికి రూ.70 ఇవ్వలేదని కత్తిపోట్లు
మద్యం తాగేందుకు రూ.70 ఇవ్వలేదనే కారణంతో అందరూ చూస్తుండగానే స్నేహితుడిని కత్తితో పొడిచిన సంఘటన విజయవాడలో మంగళవారం రాత్రి చోటుచేసుకుంది. -
చంద్రబాబు సభకు వెళ్లారని.. తెదేపా కార్యకర్తపై వైకాపా వర్గీయుడి దాడి
తెదేపా అధినేత చంద్రబాబు బహిరంగ సభకు వెళ్లాడన్న అక్కసుతో ఆ పార్టీ కార్యకర్తపై అధికార వైకాపా వర్గీయుడు దాడికి పాల్పడిన ఘటన చిత్తూరు జిల్లా శాంతిపురం మండలంలో మంగళవారం రాత్రి చోటు చేసుకొంది. -
సీఎంఆర్ఎఫ్ సొమ్ము రూ.10.50 లక్షలు స్వాహా
బాధితులకు అందాల్సిన ముఖ్యమంత్రి సహాయనిధి(సీఎంఆర్ఎఫ్) చెక్కుల సొమ్ము రూ.10.50 లక్షలను కాజేసిన నలుగుర్ని జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్టు చేశారు. -
ఛత్తీస్‌గఢ్‌లో ఎదురుకాల్పులు
ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని దండకారణ్య ప్రాంతం కాల్పుల మోతతో దద్దరిల్లింది. లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ బీజాపూర్ జిల్లా బాసగూడ పోలీస్‌స్టేషన్ పరిధిలోని చీపురుబట్టీ అటవీ ప్రాంతంలో భద్రతా బలగాలు- మావోయిస్టుల మధ్య బుధవారం జరిగిన ఎదురుకాల్పుల్లో ఆరుగురు మావోయిస్టులు మృతి చెందారు. -
అప్పుల బాధతో దంపతుల ఆత్మహత్య
తమిళనాడులోని మదురై నుంచి వచ్చి జనగామలో స్థిరపడిన దంపతులు అప్పుల బాధతో ఆత్మహత్యకు పాల్పడ్డారు. జనగామ పట్టణ సీఐ రఘుపతిరెడ్డి ఈ వివరాలు తెలిపారు. -
ఫోన్లో గట్టిగా మాట్లాడొద్దన్నందుకు కుమారుడిపై తండ్రి దాడి
ఫోన్లో గట్టిగా అరుస్తూ మాట్లాడొద్దని చెప్పినందుకు ఓ తండ్రి తన కుమారుడిపై తీవ్రంగా దాడి చేయడంతో ప్రాణాలు కోల్పోయిన ఘటన మహారాష్ట్రలోని నాగ్‌పుర్ జిల్లాలో చోటుచేసుకుంది. -
‘గ్రూప్-1’ ఉద్యోగాల పేరిట టోకరా!
నిరుద్యోగుల బలహీనతలను ఆసరాగా చేసుకొన్న ఓ ముఠా ‘గ్రూప్-1’ ఉద్యోగాల పేరుతో పలువురికి టోకరా వేసిన వైనం వెలుగులోకి వచ్చింది. -
తేనెటీగల దాడిలో పశువుల కాపరి మృతి
తేనెటీగల దాడిలో పశువుల కాపరి మృతిచెందిన సంఘటన జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం ముత్యంపేటలో బుధవారం సాయంత్రం చోటుచేసుకుంది. -
13 క్వింటాళ్ల పేలుడు పదార్థాల పట్టివేత
మహబూబాబాద్ జిల్లా మరిపెడ పోలీస్‌స్టేషన్ పరిధిలో 13 క్వింటాళ్ల పేలుడు పదార్థాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరు నిందితులను అరెస్టు చేశారు. -
ఓక్రా, ఫైజల్ కస్టడీకి అనుమతి
పంజాగుట్ట డ్రగ్స్ కేసులో నిందితుడు నైజీరియా వాసి ఆంటోనియో ఒబింటా అలియాస్ ఓక్రాను నాలుగు రోజుల కస్టడీకి అనుమతిస్తూ నాంపల్లి కోర్టు ఆదేశాలిచ్చింది.
తాజా వార్తలు (Latest News)
-
పరిశ్రమలు తెచ్చి కొడంగల్‌ను అభివృద్ధి చేస్తా: సీఎం రేవంత్
-
ఆ హంతకులకు, జగన్‌కు ఓటు వేయొద్దు: వివేకా కుమార్తె సునీత
-
కేజ్రీవాల్‌కు ఈడీ కస్టడీ పొడిగింపు.. కోర్టులో సీఎం స్వీయ వాదనలు!
-
భారీ లాభాల్లో సూచీలు.. సెన్సెక్స్ 655, నిఫ్టీ 203
-
అదితితో పెళ్లి వార్తలు.. ఫొటో షేర్ చేసిన సిద్ధార్థ్
-
నాటో దేశాలపై దాడి చేయం.. ఎఫ్-16లను మాత్రం కూల్చివేస్తాం: పుతిన్