ఫుడ్ పాయిజన్‌.. 26 మంది ఇంజినీరింగ్‌ విద్యార్థులకు అస్వస్థత

ఫుడ్‌ పాయిజన్‌ కావడంతో 26 మంది ఇంజినీరింగ్‌ విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. ఈ ఘటన అనంతపురం జిల్లా బుక్కరాయసముద్రం మండల పరిధిలోని ఎస్‌ఆర్‌ఐటీ ఇంజినీరింగ్‌ కళాశాల హాస్టల్‌లో చోటుచేసుకుంది. 

Updated : 31 May 2023 12:47 IST

బుక్కరాయసముద్రం: ఫుడ్‌ పాయిజన్‌ కావడంతో 26 మంది ఇంజినీరింగ్‌ విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. ఈ ఘటన అనంతపురం జిల్లా బుక్కరాయసముద్రం మండల పరిధిలోని ఎస్‌ఆర్‌ఐటీ ఇంజినీరింగ్‌ కళాశాల హాస్టల్‌లో చోటుచేసుకుంది. 

మంగళవారం రాత్రి విద్యార్థులు గుడ్డుతో పాటు టమాటా రైస్‌, పెరుగన్నం తిన్నారు. ఆ తర్వాత 26 మంది విద్యార్థులు అస్వస్థతకు గురికావడంతో వారిని అనంతపురంలోని అమరావతి ఆస్పత్రికి తరలించారు. అందులో ఏడుగురి పరిస్థితి ఆందోళనకరంగా ఉండటంతో వారిని ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నారు. వీరితో పాటు మరికొందరు విద్యార్థులు కూడా స్వల్ప అస్వస్థతకు గురైనట్లు తెలుస్తోంది. వారిని హాస్టల్‌ వద్దే ఉంచి చికిత్స అందిస్తున్నట్లు సమాచారం.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని