AP News: కోవూరులో భారీ శబ్దంతో పేలుడు.. ధ్వంసమైన భవనం 

నెల్లూరు జిల్లా కోవూరు శ్మశానవాటిక వద్ద భారీ శబ్దంతో పేలుడు సంభవించింది. దీంతో కిలోమీటర్ల మేర ఈ పేలుడు శబ్దం వినిపించింది.

Published : 25 Nov 2021 01:57 IST

కోవూరు: నెల్లూరు జిల్లా కోవూరు శ్మశానవాటిక వద్ద భారీ శబ్దంతో పేలుడు సంభవించింది. దీంతో కిలోమీటర్ల మేర ఈ పేలుడు శబ్దం వినిపించింది. ఈ పేలుడు ధాటికి శ్మశానవాటిక సమీప భవనం ధ్వంసమైంది. సమీప భవనాల అద్దాలు పగిలాయి. ఒక స్తంభం నేలకూలి విద్యుత్‌ సరఫరా ఆగిపోయింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకొని పరిశీలించారు. ఈ పేలుడు ఘటనపై పోలీసులు విచారణ జరుపుతున్నారు. 
 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని