Hyderabad: భాగ్యనగరంలో పేలుడు పదార్థాల కలకలం

హైదరాబాద్‌ పాతబస్తీలోని చంద్రాయనగుట్టలో జిలిటెన్‌ స్టిక్స్‌ (Gelatin sticks), డిటోనేటర్లు(Detonators)కలకలం సృష్టించాయి.

Updated : 04 Feb 2023 21:49 IST

హైదరాబాద్: భాగ్యనగరంలో పేలుడు పదార్థాలు (Explosives) కలకలం సృష్టించాయి. పాతబస్తీ చంద్రాయణగుట్టలో జిలిటెన్‌ స్టిక్స్‌ (Gelatin sticks) పట్టుబడటం కలవరానికి గురి చేస్తోంది. దాదాపు 600 జిలిటెన్‌ స్టిక్స్, 600 డిటోనేటర్లు తరలిస్తున్న కారును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనలో ముగ్గురుని అరెస్టు చేసినట్లు చంద్రాయణగుట్ట పోలీసులు తెలిపారు. పరారీలో ఉన్న మరో ముగ్గురి కోసం గాలిస్తున్నారు. వివరాల్లోకి వెళ్తే.. బార్కస్‌ ప్రాంతానికి చెందిన అజీజ్‌ మహరూస్‌ అనే వ్యక్తి బాలాపూర్‌కి చెందిన వెంకట్‌రెడ్డి నుంచి జిలెటిన్‌ స్టిక్స్‌ ఆర్డర్‌ చేసి తెప్పించుకున్నాడు. లైసెన్స్‌ హోల్డర్‌ అయిన వెంకట్‌రెడ్డి నిబంధనలకు విరుద్ధంగా పెద్దమొత్తంలో ఈ పేలుడు పదార్థాలను అజీజ్‌ మహరూస్‌కు చేరవేస్తుండగా చాంద్రాయణ గుట్ట పోలీసులు బార్కస్‌లో పట్టుకున్నారు. వెంకట్‌రెడ్డితో పాటు రమేష్, అజీజ్‌ మహరూస్‌లను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ కేసులో పి.రాంరెడ్డి, జగదీశ్‌, గోపాల్‌ పరారీలో ఉన్నట్లు ఇన్‌స్పెక్టర్‌ ప్రసాద్‌వర్మ తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని