Crime news: ‘ఫిబ్రవరి 14కల్లా బాయ్‌ఫ్రెండ్‌ ఉండాల్సిందే..’ కాలేజీ ఫేక్‌ నోటీస్‌పై కేసు నమోదు

కాలేజీ ప్రిన్సిపల్‌ సంతకాన్ని ఫోర్జరీ చేసిన ఆకతాయిలు సృష్టించిన ఓ ఫేక్‌ నోటీసు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ఫిబ్రవరి 14 వాలంటైన్స్‌ డే నాటికి కాలేజీ ప్రతి విద్యార్థినికీ  తప్పనిసరిగా బాయ్‌ఫ్రెండ్‌ ఉండాల్సిందేనంటూ పేర్కొన్న ఈ నోటీసుపై పోలీసులు కేసు నమోదు చేశారు.

Updated : 24 Jan 2023 16:58 IST

పారాదీప్‌: ఫిబ్రవరి 14న వాలంటైన్స్‌ డే(Valentine's Day)కు ముందు తమ కాలేజీలో ప్రతి ఒక్క విద్యార్థినికీ తప్పనిసరిగా బాయ్‌ఫ్రెండ్‌ ఉండాల్సిందేనని యాజమాన్యం ఆదేశించినట్టుగా వచ్చిన ఓ ఫేక్‌ నోటీస్‌ తీవ్ర కలకలం రేపింది. ఈ వ్యవహారం ఒడిశా(Odisha)లోని జగత్‌సింగ్‌పూర్‌ జిల్లాలో వెలుగుచూసింది. ఎస్‌వీఎం అటానమస్‌ కళాశాల ప్రిన్సిపల్‌ సంతకంతో ఉన్న ఈ నోటీసు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ఈ వ్యవహారంపై కళాశాల ప్రిన్సిపల్‌ బిజయ్‌ కుమార్‌ పాత్రా స్పందించారు. ఆ నకిలీ నోటీసును తాము చూసినట్టు తెలిపారు. కొందరు ఆకతాయిలు దీన్ని వైరల్‌ చేశారని తెలిపారు. తమ కాలేజీ ప్రతిష్ఠను దిగజార్చేందుకే ఇలాంటి అనుచిత చర్యలకు పాల్పడ్డారని విమర్శించారు. అలాగే, తన ప్రతిష్ఠను సైతం మసకబార్చేందుకే తన సంతకం ఫోర్జరీ చేశారన్నారు. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు ప్రిన్సిపల్‌ వెల్లడించారు. మరోవైపు, ఈ వ్యవహారంపై జగత్‌సింగ్‌పూర్‌ పోలీస్‌ స్టేషన్‌ అధికారి స్పందించారు. దీనిపై ప్రిన్సిపల్‌ తమకు ఫిర్యాదు చేసినట్టు ధ్రువీకరించిన పోలీసులు.. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్టు చెప్పారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని