Hyderabad: విషాదం.. ఇద్దరు పిల్లలతో సహా దంపతుల ఆత్మహత్య

హైదరాబాద్‌ కుషాయిగూడలో ఇద్దరు పిల్లలతో సహా దంపతులు ఆత్మహత్యకు పాల్పడ్డారు.

Published : 25 Mar 2023 17:42 IST

కాప్రా: హైదరాబాద్‌ కుషాయిగూడ పరిధి కాప్రాలోని కందిగూడలో విషాదం చోటు చేసుకుంది. ఇద్దరు పిల్లలతో సహా దంపతులు ఆత్మహత్య చేసుకున్నారు. మృతులను దంపతులు సతీశ్‌ (39), వేద (35), చిన్నారులు నిషికేత్‌ (9),నిహాల్‌ (5)గా గుర్తించారు. పిల్లల అనారోగ్యం కారణంగా సైనేడ్‌ మింగి ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం. సతీశ్‌ సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా పని చేస్తున్నట్లు తెలుస్తోంది. స్థానికుల సమాచారం మేరకు సంఘటన స్థలికి చేరుకున్న పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని